పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి మృతిపై.. తెలంగాణ గవర్నర్ తమిళిసై ఆగ్రహం, విచారణ చేయాలని కాళోజీ వర్సిటీ వీసీకి లేఖ

Telangana Governor Tamilisai Soundararajan Writes Letter To Kaloji University Over Pg Medical Student Preethi Demise,Telangana Governor Tamilisai Soundararajan,Governor Tamilisai Soundararajan Letter,Governor Tamilisai Letter To Kaloji University,Tamilisai Soundararajan Over Pg Medical Student Preethi,Mango News,Mango News Telugu,Nims Hospital Hyderabad,Nims Hospital Panjagutta Contact Number,Warangal News,Warangal News Live,Warangal News Today English,Warangal News Today Telugu,Warangal Newspaper Today, Telangana Governor Tamilisai Soundararajan Twitter,Telangana Governor Whatsapp Number,Warangal News,Warangal News Live,Warangal News Today English,Warangal News Today Telugu,Warangal Newspaper Today

వరంగల్ జిల్లాలోని కాకతీయ మెడికల్ కాలేజీ (కేఎంసీ)లో పీజీ చ‌దువుతున్న డాక్ట‌ర్ ప్రీతి మృతి ఘటన తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆత్మహత్యకు ప్రయత్నించిన ప్రీతి హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది. ఈ నేపథ్యంలో ప్రీతి మృతి ఘటనపై తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రీతి ఆత్మహత్య కేసులో నిందితుడిని కాపాడేందుకు ఆమె ఆరోగ్య పరిస్థితిపై తప్పుడు సమాచారం ఇచ్చారని కాళోజీ వర్సిటీ అధికారులపై గవర్నర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె కాళోజీ హెల్త్ సైన్సెస్ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్‌కు లేఖ రాశారు. అందులో.. ప్రీతి మృతి విషయంలో జోక్యం చేసుకుని సమగ్ర విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని ఆదేశించారు.

గవర్నర్ తమిళిసై రాసిన లేఖలో ఇలా తెలిపారు.. ప్రీతి మృతి విషయంలో జోక్యం చేసుకుని సమగ్ర విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని, ఇలాంటి ఘటనల్లో ఉదాసీనంగా వ్యవహరించకుండా తక్షణం స్పందించి కఠినచర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మెడికల్ కాలేజీలలో యాంటీ ర్యాగింగ్ చర్యలు పటిష్టంగా తీసుకోవాలని, మహిళా మెడికోలకు ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయాలని గవర్నర్ సూచించారు. అలాగే మెడికల్ కాలేజీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, పీజీ మెడికోల డ్యూటీ సమయాలు, వారికి సంబంధించి సరైన విశ్రాంతి లాంటి అంశాలపై సరైన శ్రద్ధ పెట్టాలని లేఖలో కోరారు. ఇంకా ఒత్తిడిని తట్టుకునేందుకు మహిళా మెడికోలకు కౌన్సెలింగ్ సెంటర్లు వంటివి కూడా ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని, మెడికోలు మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్లు పనిగంటలపై కూడా దృష్టి సారించాలని గవర్నర్ తమిళిసై సూచించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen + 10 =