ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త, కోత విధించిన జీతాలు చెల్లించాలని నిర్ణయం

తెలంగాణ Deferred Salary of Govt Employees Pensioners, Deferred Salary of Govt Employees To Pay, Govt To Pay Deferred Salary of Govt Employees, Govt to Pay Deferred Salary of Pensioners, telangana, Telangana Govt Decide to Pay Deferred Salary of Govt Employees, Telangana Govt Employees, Telangana Govt Employees Salaries, Telangana Govt to Pay Deferred Salary of Pensioners, Telangana News

కోవిడ్‌-19 (కరోనా వైరస్‌) నియంత్రణ చర్యల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో రెండు నెలల పాటుగా లాక్‌డౌన్‌ విధించిన నేపథ్యంలో ఆర్ధిక వ్యవస్థపై ప్రభావం పడడంతో ప్రజాప్రతినిధులకు, ఐఏఎస్ అధికారులకు, ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు మార్చ్, ఏప్రిల్, మే నెలలకు సంబంధించి వేతనాల్లో కొంత శాతం కోత విధించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ఆదాయ పరిస్థితి మెరుగైన అనంతరం జూన్ నెల నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు పూర్తి వేతనం చెల్లిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది.

లాక్‌డౌన్‌ సమయంలో కోత విధించిన వేతనాలు, పెన్షన్ల మొత్తాన్ని తిరిగి చెల్లించనున్నట్టుగా బుధవారం నాడు ప్రకటించింది. రాష్ట్రంలో పెన్షనర్లకు కోత విధించిన పెన్షన్లను అక్టోబర్‌, నవంబర్ నెల‌ల్లో రెండు విడతులుగా చెల్లించనున్నారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్ట్‌ /ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు అక్టోబర్‌, నవంబర్‌, డిసెంబర్‌, జనవరి నెలల్లో నాలుగు విడతల్లో కోత బకాయిల చెల్లింపులు జరపనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here