తెలంగాణ బీజేపీలో కొత్తగా 3 కమిటీలు నియామకం, చేరికలపై సమన్వయ కమిటీ కన్వీనర్ గా ఈటల రాజేందర్

Telangana BJP Chief Bandi Sanjay Appointed 3 New Committees to Strengthen the Party In State, Bandi Sanjay Appointed 3 New Committees to Strengthen the Party In State, BJP Chief Bandi Sanjay Appointed 3 New Committees to Strengthen the Party In State, Telangana BJP Chief Appointed 3 New Committees to Strengthen the Party In State, 3 New Committees to Strengthen the Party In State, 3 New Committees, Telangana BJP Chief Bandi Sanjay Kumar, BJP Chief Bandi Sanjay Kumar, Telangana BJP Chief, Bandi Sanjay Kumar, Telangana BJP 3 New Committees News, Telangana BJP 3 New Committees Latest News, Telangana BJP 3 New Committees Latest Updates, Telangana BJP 3 New Committees Live Updates, Mango News, Mango News Telugu,

తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా బీజేపీ ప్రణాళికలు రూపొందిస్తున్న విషయం తెలిసిందే. జూలై 2, 3 తేదీల్లో హైదరాబాద్‌లో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో తెలంగాణలో పార్టీ బలోపేతంపై చర్చల అనంతరం బీజేపీ రాష్ట్ర నాయకత్వం తమ కసరత్తును మరింత వేగవంతం చేసింది. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ తాజాగా పార్టీకి సంబంధించి మూడు కమిటీలను నియమించారు. చేరికలపై సమన్వయ కమిటీ, ఫైనాన్స్ కమిటీ, ప్రజా సమస్యలు, టీఆర్ఎస్ వైఫల్యాలపై అధ్యయన కమిటీ వంటి మూడు కమిటీల నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు.

చేరికలపై సమన్వయ కమిటీ:

1. ఈటల రాజేందర్, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు – కన్వీనర్
2. డి.కె. అరుణ, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు
3. డా.కె.లక్ష్మణ్, బీజేపీ ఓబీసి మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ ఎంపీ
4. వివేక్ వెంకటస్వామి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు
5. గరికపాటి మోహన్ రావు, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు
6. ఏ.చంద్రశేఖర్, మాజీ మంత్రి
7. కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మాజీ ఎంపీ
8. దుగ్యాల ప్రదీప్ కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

ఫైనాన్స్ కమిటీ:

1. ఏ.పి. జితేందర్ రెడ్డి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు – కన్వీనర్
2. గరికపాటి మోహన్ రావు, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు
3. చాడ సురేశ్ రెడ్డి, మాజీ ఎంపీ
4. చింతల రామచంద్రా రెడ్డి, మాజీ ఎమ్మెల్యే
5. శాంతి కుమార్, రాష్ట్ర కోశాధికారి
6. యోగానంద్, రాష్ట్ర నాయకుడు

ప్రజా సమస్యలు, టీఆర్ఎస్ వైఫల్యాలపై అధ్యయన కమిటీ:

1. ధర్మపురి అర్వింద్, ఎంపీ- కన్వీనర్
2. వివేక్ వెంకటస్వామి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు
3. రఘునందన్ రావు, ఎమ్మెల్యే
4. స్వామి గౌడ్, శాసనమండలి మాజీ చైర్మన్
5. డా.ప్రకాశ్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి
6. బాబీ అజ్మీరా, ఎస్టీ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × one =