కరోనాతో ఒకేరోజు 481 మంది మృతి, మరో 18317 పాజిటివ్ కేసులు నమోదు

Corona Positive Cases in Maharashtra, Corona Positive Cases In Maharashtra, Maharashtra, Maharashtra , Maharashtra Corona, Maharashtra Corona Cases, Maharashtra Corona Deaths, Maharashtra Corona Positive Cases, Maharashtra Coronavirus, Maharashtra Coronavirus Positive Cases, Maharashtra Coronavirus Updates, Maharashtra COVID 19

మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతుంది. ఆ రాష్ట్రంలో ఇప్పటికే పాజిటివ్ కేసుల సంఖ్య 13 లక్షలు దాటింది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 30, బుధవారం నాడు కొత్తగా 18,317 కరోనా పాజిటివ్ కేసులు, 481 కరోనా మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 13,84,446 కి చేరగా, మొత్తం మరణాల సంఖ్య 36,662 కు పెరిగింది. మహారాష్ట్రలో ఇప్పటికి 67,85,205 కరోనా పరీక్షలు నిర్వహించారు.

మహారాష్ట్రలో కరోనా కేసుల వివరాలు (సెప్టెంబర్ 30, బుధవారం నాటికీ):

  • రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య – 13,84,446
  • డిశ్చార్జ్ అయినవారి సంఖ్య – 10,88,322
  • యాక్టీవ్ కేసులు – 2,59,033
  • సెప్టెంబర్ 30 న నమోదైన కేసులు – 18,317
  • సెప్టెంబర్ 30 న డిశ్చార్జ్ అయినవారు – 19,163
  • సెప్టెంబర్ 30 న నమోదైన మరణాల సంఖ్య – 481
  • మొత్తం మరణాల సంఖ్య – 36,662

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here