అకాల వర్షాలకు పంట నష్టం, నేడు ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటన

CM KCR will Visit Khammam Karimnagar Mahabubabad Warangal Districts Affected by Rains and Hailstorm on Today,CM KCR will Visit Affected Districts,KCR on Districts Affected by Rains and Hailstorm,CM KCR will Visit Khammam and Karimnagar,Mango News,Mango News Telugu,Telangana KCR To Tour Four Districts Today,Telangana CM K Chandrasekhar Rao,Telangana CM To Visit Rain Affected Districts,CM KCR Tours In Khammam,CM KCR Namasthe Telangana Today,CM KCR to tour hailstorm Affected Districts,CM KCR News And Live Updates

తెలంగాణ రాష్ట్రంలో అకాలవర్షం, వడగళ్ల వానతో పలు జిల్లాల్లో ఉద్యాన, వ్యవసాయ పంటలకు తీవ్ర పంట నష్టం జరిగిన విషయం తెలిసిందే. అకాల వర్షాలకు పంట నష్టం జరిగిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఈరోజు (మార్చి 23, గురువారం) ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాల వలన నష్టం కలిగిన పంటల్ని సీఎం స్వయంగా పరిశీలించనున్నారు. ఈ సందర్భంగా రైతులను సీఎం కేసీఆర్ కలిసి, పరామర్శించి వారికి భరోసా కల్పించనున్నారు.

సీఎం కేసీఆర్ పర్యటన షెడ్యూల్‌:

  • ఉదయం 10.15 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి హెలిక్యాప్టర్‌లో బయలుదేరి, 11.15 గంటలకు ఖమ్మం జిల్లాలోని బోనకల్‌ మండల పరిధిలోని రామాపురం గ్రామానికి చేరుకుని, గార్లపాడు, రావినూతల, ముష్టికుంట్ల గ్రామాల్లో దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తారు.
  • 11.45 గంటలకు రామాపురం నుంచి బయలుదేరి, 12.10 గంటలకు మహబూబాబాద్‌ జిల్లా పెద్దవంగర మండలం రెడ్డికుంటతండాకు చేరుకుని, దెబ్బతిన్న పంటలను సీఎం పరిశీలించనున్నారు.
  • అనంతరం 12.55 గంటలకు వరంగల్‌ జిల్లాలోని దుగ్గొండి మండలం అడవి రంగాపురం గ్రామానికి చేరుకుని, అక్కడ వర్షాలు, ;వడగండ్ల వానకు డెబ్బదిన్న పంటలను పరిశీలించి రైతులకు భరోసా ఇవ్వనున్నారు.
  • ఇక మధ్యాహ్నం 1.30 గంటలకు అడవి రంగాపురం గ్రామం నుంచి హెలిక్యాప్టర్‌లో బయలుదేరి, 1.55 గంటలకు కరీంనగర్‌ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపురం గ్రామానికి చేరుకుని, దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తారు.
  • అనంతరం హైదరాబాద్‌ కు తిరుగుప్రయాణమై, 3.30 గంటలకు సీఎం కేసీఆర్ ప్రగతిభవన్‌కు చేరుకోనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here