తెలంగాణలో కొత్త‌గా 404 మ‌ద్యం దుకాణాలు, 2620కి పెరిగిన సంఖ్య

Mango News, New wine shops In Telangana, Telangana Govt, Telangana Govt Increased 404 New Wine Shops, Telangana Govt Increased 404 New Wine Shops in the State, Telangana Liquor Shops, Telangana new wine shops, Telangana to get extra 404 20 liquor stores, telangana wine shops, Telangana wine shops News, TS Govt Increase Wine Shops, TS Govt Increase Wine Shops In State

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 404 మద్యం దుకాణాలు ఏర్పాటు కానున్నాయి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 2,216 మద్యం దుకాణాలు ఉండగా, డిసెంబర్‌ 1 తేదీ నుంచి అమల్లోకి వచ్చే నూతన మద్యం విధానంలో భాగంగా మరో 404 మ‌ద్యం దుకాణాలను పెంచుతున్నట్టు రాష్ట్ర ఆబ్కారీ శాఖ వెల్లడించింది. కొత్తగా పెంచిన 404 దుకాణాలతో కలిపి రాష్ట్రంలో మొత్తం మద్యం దుకాణాల సంఖ్య 2,620కి పెరిగింది. మరోవైపు మద్యం దుకాణాల్లో గౌడ్‌ల‌కు 15 శాతం, ఎస్సీల‌కు 10 శాతం, ఎస్టీల‌కు 5 శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పిస్తూ తెలంగాణ ప్ర‌భుత్వం గతంలో ఉత్త‌ర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆయా రిజర్వేషన్ల ప్రకారం గౌడ్‌, ఎస్సీ, ఎస్టీలకు తాజాగా మద్యం దుకాణాల కేటాయింపు పూర్తయింది.

గౌడ్‌ లకు 363, ఎస్సీలకు 262, ఎస్టీలకు 131 కలిపి రాష్ట్రంలో మొత్తం 756 దుకాణాల కేటాయింపు పూర్తికాగా, ఓపెన్ కేటగిరీ కింద మిగిలిన 1,864 మ‌ద్యం దుకాణాలకు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. నవంబర్ 9 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుండగా, ఈ నెల 18వ తేదీని చివర తేదీగా నిర్ణయించారు. ఇక నవంబర్ 20న ఆయా జిల్లాల కలెక్టర్ల సమక్షంలో డ్రా విధానం ద్వారా ఎంపిక ప్రక్రియ పూర్తి చేసి ఓపెన్ కేటగిరీ మద్యం దుకాణాలను కేటాయించనున్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 5 =