తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు రేపే, అన్ని ఏర్పాట్లు పూర్తి

Mango News, Telangana Graduates MLC Elections, Telangana Graduates MLC Elections Counting, Telangana Graduates MLC Elections Counting Process, Telangana Graduates MLC Elections Counting Process Start, Telangana Graduates MLC Elections Counting Process Start Tomorrow, Telangana MLC Elections, Telangana MLC Elections 2021, Telangana MLC Elections 2021 Results, Telangana MLC Elections Counting, Telangana MLC Elections Results

తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం-నల్లగొండ-వరంగల్ మరియు హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు మార్చి 14న పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ పక్రియను రేపు (మార్చి 17, బుధవారం) చేపట్టనున్నారు. రాష్ట్రంలోని టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ వంటి ప్రధాన రాజకీయపార్టీలు ఈ ఎన్నికల కోసం పెద్దఎత్తున ప్రచారం నిర్వహించడంతో ఫలితాలపై ప్రజల్లో ఉత్కంఠ నెలకుంది.

ఖమ్మం-నల్లగొండ-వరంగల్‌ స్థానం ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ పక్రియ నల్గొండలో ఆర్జాలబావి రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాంలో, హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ స్థానం ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో జరుగనుంది. కౌంటింగ్ పక్రియ కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తిచేశారు. కౌంటింగ్‌ కేంద్రం వద్ద 144 సెక్షన్‌ అమలులో ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఈ రెండు స్థానాలకు కలిపి మొత్తం 164 మంది అభ్యర్థులు బరిలో నిలవడంతో కౌంటింగ్ పక్రియకు ఎక్కువ సమయం పట్టనుంది. కౌంటింగ్ కోసం మొత్తం 1,606 మంది సిబ్బందిని వినియోగించనున్నారు. ఖమ్మం-నల్లగొండ-వరంగల్ స్థానంలో 76.41 శాతం అనగా 3,86,320 మంది ఓటర్లు, హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ స్థానంలో 67.26 శాతం అనగా 3,57,354 మంది ఓటర్లు తమ హక్కు వినియోగించుకున్నారు.

ఖమ్మం-నల్లగొండ-వరంగల్ స్థానంలో 71మంది మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ స్థానంలో టీఆర్‌ఎస్‌ నుంచి పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కాంగ్రెస్‌ నుంచి రాములు నాయక్, బీజేపీ నుంచి ప్రేమేందర్‌ రెడ్డి, తెలంగాణ జన సమితి నుంచి ఫ్రొఫెసర్ కోదండరాం, ఇండిపెండెంట్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న పోటీలో ఉన్నారు. అలాగే హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ స్థానంలో 93 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ స్థానంలో టీఆర్‌ఎస్‌ నుంచి సురభి వాణిదేవి, కాంగ్రెస్‌ నుంచి చిన్నారెడ్డి, బీజేపీ నుంచి రామచంద్రరావు, టీడీపీ నుంచి ఎల్.రమణ, ఇండిపెండెంట్ అభ్యర్థిగా ప్రొఫెసర్ నాగేశ్వర్ పోటీలో ఉన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 + seven =