తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ ను కలిసిన బీహార్ ఫైనాన్స్ సర్వీసు అధికారులు

Bihar officers meets Telangana Chief Secretary, Bihar officers meets Telangana Chief Secretary On GST, Chief Secretary briefs Bihar delegatio, Chief Secretary Somesh Separate tags with Kumar, Commercial tax revenues doubled in State, Mango News, Somesh Kumar, Telangana Chief Secretary Somesh Kumar, Telangana CS, Telangana CS Somesh Kumar, Telangana CS Somesh Kumar explains GST execution, TS achieved rapid progress in increasing tax base

బీహార్ ఫైనాన్స్ సర్వీసు అధికారులు మంగళవారం నాడు బి.ఆర్.కె.ఆర్ భవన్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను కలిసారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో జిఎస్టి అమలు తీరుపై అధికారులకు సీఎస్ వివరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మార్గనిర్ధేశకత్వంలో టాక్స్ బేస్ లో గణనీయమైన పురోగతిని సాధించడం వలన గత 5 సంవత్సరాలలో క‌మ‌ర్షియ‌ల్ ట్యాక్స్ రెవెన్యూను రెట్టింపు చేయడం సాధ్యమైందని తెలిపారు.

2018, 2020 లో రెండుసార్లు వాణిజ్యపన్నుల శాఖను హేతుబద్ధీకరణ, పునర్వ్యవస్ధీకరణ చేయడం జరిగిందన్నారు. ఆర్ధిక వ్యవస్ధలోని ముఖ్యమైన రంగాలలో విశ్లేషణ, పరిశోధన, రెవెన్యూ పొటెన్షియల్ ఉన్న ఏరియాల గుర్తింపు కోసం శాఖలో ఎక‌నామిక్ ఇంట‌లిజెన్స్ వింగ్‌ ను ఏర్పాటు చేశామన్నారు. వాణిజ్య పన్నుల శాఖలో టెక్నాలజి వినియోగం, యాప్స్‌, డేటా అన‌లిటిక్స్ ద్వారా ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ సిస్టం ఇండివిజువ‌ల్ బేస్ నుండి సిస్టం డ్రివెన్ ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్‌ గా మార్పు చెంది రెవెన్యూ రియలైజేషన్ లక్ష్యాలను సాధించడం జరిగిందని సీఎస్ సోమేశ్ కుమార్ వివరించారు. ఈ సమావేశంలో ఎంసీహెచ్ఆర్‌డీ డైరెక్టర్ జనరల్ హర్ ప్రీత్ సింగ్, వాణిజ్య పన్నుల శాఖ కమీషనర్ నీతూప్రసాద్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight − six =