తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 100కి పైగా డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేశాం – మంత్రి హరీశ్ రావు

Telangana Health Minister Harish Rao Lays Foundation Stone For Mata Shishu Hospital Building at Husnabad Today,Telangana Health Minister Harish Rao,Shishu Hospital Building,Shishu Hospital Building Husnabad,Husnabad Shishu Hospital Building,Shishu Hospital Building Telangana,Telangana Shishu Hospital Building,Shishu Hospital Building Latest News And Updates,Mango News,Mango News Telugu,CM KCR News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP,TRS Party, BRS Party, Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates

తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు రాష్ట్రంలో కేవలం మూడు డయాలసిస్ కేంద్రాలు ఉండేవని, అయితే రాష్ట్రం ఏర్పడ్డాక ఈ ఎనిమిదేళ్లలో 102 డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు. సోమవారం ఆయన సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో 50 పడకల మాతాశిశు ఆసుపత్రి భవనానికి శంకుస్థాపన చేశారు. అలాగే ఉచిత డయాలసిస్ కేంద్రం-రక్త శుద్ధీకరణ కేంద్రానికి కూడా ప్రారంభోత్సవం చేశారు. వీటితో పాటు హుస్నాబాద్ సామాజిక ఆరోగ్య కేంద్ర పాత భవనం అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సతీశ్, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ సహా పలువురు వైద్యశాఖ అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. తెలంగాణ వ్యాప్తంగా మారుమూల గ్రామాల్లో సైతం ఉచిత వైద్యం అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని, త్వరలోనే అన్ని గ్రామాల్లో వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఇక తాను రెండవసారి టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టానని, ఈ క్రమంలో రాష్ట్రంలో 3 ఎంసీహెచ్‌లకు ప్రతిపాదనలు రూపొందించానని వెల్లడించారు. వీటిలో మొదటిది హుస్నాబాద్ ఆస్పత్రి అని మంత్రి పేర్కొన్నారు. హుస్నాబాద్ ఆస్పత్రి 100 పడకల ఆస్పత్రిగా నిలిచిందని, అలాగే 2.85లక్షలతో డయాలసిస్‌ సెంటర్ ప్రారంభించుకున్నామని చెప్పారు. ఇక గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తయితే జిల్లాలోని లక్ష ఎకరాలకు సాగునీరు అందుతుందని, తద్వారా 50వేల మంది రైతుల వరకు ప్రయోజనం కలుగుతుందని మంత్రి హరీశ్ రావు తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 − 2 =