గేటెడ్ కమ్యూనిటీ, అపార్ట్‌మెంట్ల ప్రజలు ట్విట్టర్‌లో కోరితే చాలు, వారివద్దకే కంటివెలుగు సేవలు – మంత్రి హరీశ్‌ రావు

Telangana Health Minister Harish Rao Starts The Second Phase of Kanti Velugu program at Ameerpet Hyderabad,Telangana Health Minister Harish Rao,Second Phase of Kanti Velugu program, Kanti Velugu Ameerpet Hyderabad,Mango News,Mango News Telugu,Minister Harish Rao,Kanti Velugu Programme,Kanti Velugu-2 Programme,Kanti Velugu Programme Telangana,Telangana Kanti Velugu Programme,Kanti Velugu Programme Latest News and Updates,Kanti Velugu News and Live Updates,CM KCR News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP,TRS Party, BRS Party, Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates,Telangana Minister KTR

తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు గురువారం సనత్ నగర్ నియోజకవర్గం అమీర్‌పేటలోని వివేకానంద కమ్యూనిటీ హాల్‌లో రెండో దశ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేష్‌, హెల్త్‌ కమిషనర్‌ శ్వేతా మహంతి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌ రావు మీడియాతో మాట్లాడుతూ.. బుధవారం ఖమ్మంలో సీఎం కేసీఆర్ సహా ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమక్షంలో కంటి వెలుగు కార్యక్రమం లాంఛనంగా ప్రారంభమైందని, నేటినుంచి పూర్తిస్థాయిలో జరుగుతుందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 16533 కేంద్రాలు ఏర్పాటు చేశామని, మొత్తం 1500 బృందాలు పరీక్షలు నిర్వహించి మందులు, కళ్లద్దాలు పంపిణీ చేయనున్నాయని వివరించారు.

అలాగే ఒక్కో బృందంలో ఎనిమిది మంది సిబ్బంది ఉంటారని, రోజుకు 120 నుంచి 130 మందికి పరీక్షలు నిర్వహిస్తారని మంత్రి హరీశ్‌ రావు తెలిపారు. ఇక ప్రజలు కోరుకున్న చోటే శిబిరాలు ఏర్పాటు చేస్తామని, కళ్లద్దాలు కూడా సిబ్బంది ఇంటివద్దకు తెచ్చిస్తారని వెల్లడించారు. అలాగే ఎక్కడైనా గేటెడ్ కమ్యూనిటీ లేదా అపార్ట్‌మెంట్ల ప్రజలు తమ ప్రాంతంలో కంటివెలుగు సేవలు కావాలని కోరుకున్నట్లయితే.. అలాంటివారు జీహెచ్ఎంసీకి ట్విట్టర్‌లో కానీ వెబ్‌సైట్‌లో కానీ రిక్వెస్ట్ పెడితే చాలని, వారివద్దకే సిబ్బందిని పంపించి పరీక్షలు చేయిస్తామని హరీశ్‌ రావు స్ఫష్టం చేశారు. ఈసారి రెండో విడతలో ‘మేడ్ ఇన్ తెలంగాణ’ కళ్ళద్దాలను పంపిణీ చేస్తున్నామని, పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులందరూ దీనిలో పాల్గొని విజయవంతం చేయాలని మంత్రి కోరారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here