బండి సంజయ్‌ తలపెట్టిన నిరుద్యోగ దీక్ష పచ్చి అవకాశవాదమే : మంత్రి కేటీఆర్

Bandi Sanjay Nirudyoga Deeksha, Bandi Sanjay Nirudyoga Deeksha News, Bandi Sanjay Nirudyoga Deeksha Updates, BJP deeksha on jobs an opportunistic stun, Describes Deeksha as an Opportunistic Stunt, KTR Counters on Bandi Sanjay, KTR questions BJP leader Bandi on jobs for unemployed, KTR slams Bandi Sanjay, KTR writes to Bandi Sanjay over Deeksha, KTR writes to Bandi Sanjay over unemployment Deeksha, Mango News, Minister KTR Counters on Bandi Sanjay, Minister KTR Counters on Bandi Sanjay Nirudyoga Deeksha, Opportunistic Stunt

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సోమవారం “నిరుద్యోగ దీక్ష” తలపెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బండి సంజయ్ దీక్షను తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్ ఆదివారం నాడు వరుస ట్వీట్స్ చేశారు. “రేపు బండి సంజయ్ తలపెట్టిన దీక్ష పచ్చి అవకాశవాదమే, అది నిరుద్యోగ దీక్ష కాదు, సిగ్గులేని దీక్ష” అని అన్నారు. తెలంగాణ యువతకు ఉద్యోగాల కల్పనపై టీఆర్ఎస్ ప్రభుత్వ చిత్తశుద్ధి, ఉపాధి అవకాశాల విషయంలో బీజేపీ వైఫల్యాలపై తను రాసిన 7 పేజీల బహిరంగ లేఖను కూడా మంత్రి కేటీఆర్ జత చేశారు.

“కేంద్రంలోని మీ ఎన్డీఏ ప్రభుత్వ పాలనా వైఫల్యాలతో దేశంలో నిరుద్యోగిత రేటు గత 40 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంత స్థాయికి చేర్చిన ఘనత మీది. డీమానిటైజేషన్, జీఎస్టీ నిర్ణయాలతో కొత్త వచ్చిన ఉద్యోగాలు ఎన్ని, ఊడిన ఉద్యోగాలు ఎన్నో చెప్పగలరా? కొలువుల కల్పవల్లిగా వర్ధిల్లుతున్న హైదరాబాదుకున్న అద్బుత అవకాశమైన ఐటిఐఅర్ ప్రాజెక్టును రద్దు చేసింది మీ ఎన్డీఏ కాదా?, లక్షలాది యువత ఐటీ జాబ్స్ గండి కొట్టి, యువతరం నోట్లో మట్టికొట్టి, మళ్లీ మీరే సిగ్గుఎగ్గూ లేకుండా నిరుద్యోగ దీక్షలకు దిగుతారా?, హామీ ఇచ్చిన దాని కన్నా ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగాలిచ్చిన మా ప్రభుత్వాన్ని కాదు, లక్షలాది ఉద్యోగాలను పెండింగ్ లో పెట్టిన మీ కేంద్ర ప్రభుత్వాన్ని గల్లా పట్టుకుని నిలదీయాలి. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని 15 లక్షల ఖాళీలను ఎందుకు ఇంకా భర్తీ చేయలేదో ప్రధానిని ప్రశ్నించాలి. కేంద్ర ఎన్డీఏ ప్రభుత్వం కానీ, బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మీరు కల్పించిన ఉద్యోగాలు, నోటిఫికేషన్లు, ఖాళీలపైన ఒక శ్వేతపపత్రం విడుదల చేసే దమ్ముందా?, బీజేపీ పార్టీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనైనా తెలంగాణ కంటే ఎక్కువ ఉద్యోగాలిచ్చారా?” అని మంత్రి కేటీఆర్ బీజేపీ రాష్ట్ర నాయకత్వాన్ని ప్రశ్నిస్తూ మండిపడ్డారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four + 10 =