తెలంగాణలో ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్‌ లపై హైకోర్టు కీలక ఆదేశాలు

High Court Key Orders over LRS and BRS Schemes, Layout Regularization Scheme, LRS and BRS Schemes, LRS Scheme, LRS Scheme In Telangana, lrs telangana high court case status, Mango News Telugu, No coercive steps on LRS matters, Telangana High Court, Telangana High Court over LRS and BRS Schemes, Telangana LRS BRS status, Telangana LRS Scheme

తెలంగాణ రాష్ట్రంలో ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్‌ స్కీంలకు సంబంధించి దాఖలయిన పిటీషన్లపై హైకోర్టులో బుధవారం నాడు విచారణ జరిగింది. విచారణ అనంతరం హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. సుప్రీంకోర్టులో ఎల్ఆర్‌ఎస్‌, బీఆర్‌ఎస్‌ స్కీములపై విచారణ తేలేంతవరకు వాటికీ సంబంధించి ప్రజలపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.

ముందుగా విచారణ సందర్భంగా ఎల్‌ఆర్‌ఎస్‌ పథకంపై సుప్రీంకోర్టులో విచారణ జరగుతోందని అడ్వొకేట్‌ జనరల్‌ హైకోర్టుకు వివరించారు. ఈ స్కీంపై అన్ని రాష్ట్రాలను ఎనిమిది వారాల్లో వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించిందని తెలిపారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టు ఉత్తర్వులును సమర్పించాలని అడ్వొకేట్‌ జనరల్ ను హైకోర్టు ఆదేశించింది. అయితే జనవరి 31 తో ఎల్‌ఆర్‌ఎస్ రుసుము గడువు ముగుస్తుందని పిటిషనర్లు తెలుపగా, సుప్రీంకోర్టులో విచారణ ముగిసేదాకా ఎల్ఆర్ఎస్ విషయంలో ప్రజలపై ఎలాంటి చర్యలు వద్దని, సుప్రీంకోర్టులో విచారణ ముగిసాక తదుపరి విచారణ చేపడతామని హైకోర్టు స్పష్టం చేసింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 5 =