ఆగస్టు 19, 20న టీఎస్‌ ఐసెట్-2021‌ నిర్వహణ, నోటిఫికేషన్ విడుదల

Telangana ICET-2021 Notification Released Today

తెలంగాణ రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన టీఎస్ ఐసెట్-2021 ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ ను శనివారం నాడు ఐసెట్‌ కన్వీనర్‌ మహేందర్‌ రెడ్డి విడుదల చేశారు. ఐసెట్‌-2021 ప్రవేశ పరీక్ష కోసం ఏప్రిల్ 7 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుండగా, ఆలస్య రుసుము లేకుండా జూన్ 15 వరకు స్వీకరించనున్నారు. ఆగస్టు 19, 20 వ తేదీల్లో ఐసెట్ పరీక్షను నిర్వహించనున్నారు.

తెలంగాణలో హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్, నల్గొండ, కోదాడ, మహబూబ్ నగర్, సిద్ధిపేట, నిజామాబాదు వంటి 10 రీజినల్‌ ఆన్లైన్ సెంటర్లలో, అలాగే ఏపీలో విజయవాడ, తిరుపతి, కర్నూల్, విశాఖపట్నం రీజియన్ సెంటర్లలో ఐసెట్ పరీక్షను నిర్వహించనున్నారు. 2021 సంవత్సరానికి గానూ ఐసెట్ ప్రవేశ పరీక్షను కాకతీయ యూనివర్సిటీ నిర్వహించనుంది.

టీఎస్ ఐసెట్-2021 పరీక్షషెడ్యూల్:

  • నోటిఫికేషన్‌ విడుదల: ఏప్రిల్ 3
  • ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: ఏప్రిల్ 7
  • దరఖాస్తుల స్వీకరణ ఆఖరు తేదీ (ఆలస్య రుసుము లేకుండా) : జూన్‌ 15
  • ఆలస్య రుసుము రూ.250 తో దరఖాస్తుకు ఆఖరు తేదీ: జూన్ 30
  • ఆలస్య రుసుము రూ.500 తో దరఖాస్తుకు ఆఖరు తేదీ: జులై 15
  • ఆలస్య రుసుము రూ.1000 తో దరఖాస్తుకు ఆఖరు తేదీ: ఆగస్టు 11
  • హాల్ టికెట్స్ డౌన్ లోడ్ ప్రారంభం : ఆగస్టు 13
  • ఐసెట్ పరీక్ష నిర్వహణ తేదీలు : ఆగస్టు 19, 20
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 1 =