ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా. బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో ‘టైమ్ మేనేజ్ మెంట్’ అనే అంశం గురించి వివరించారు. మనకున్న సమయాన్ని సమపాళ్లలో విభజించి ఏ పనికి ఎంత కేటాయించాలో తెలుసుకోవడం విజ్ఞతతో కూడిన విషయమని చెప్పారు. ఎవరికైనా రోజుకు 24 గంటలే ఉంటాయని, ఒక క్రమబద్ధమైన ప్రణాళికతో టైమ్ ను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ప్రతి ఒక్కరు సమయాన్ని సరిగ్గా వినియోగించుకోవడం అలవాటు చేసుకుంటే జీవితంలో ఏదైనా సాధించగలరని, భవిష్యత్ గొప్పగా మారుతుందని పేర్కొన్నారు. సమయాన్ని ఎలా విభజించుకోవాలి?, ప్రాధాన్యతలను ఎలా ఎంచుకోవాలి? ముఖ్యమైన పనులు ఎప్పుడు చేపట్టాలి? వంటి అనేక విషయాలను ఈ ఎపిసోడ్లో పట్టాభిరామ్ గారు విశ్లేషించారు.
పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇
[subscribe]