తెలంగాణలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు-2023 ఫీజు చెల్లింపు వివరాలివే…

Telangana Intermediate Board Announces Due Dates For Fee Payment Of Inter Public Exams-2023,Due Dates For Inter Exam,Fee Notified By Ts Bie,Telangana Intermediate Board,Due Dates For Fee Payment,Inter Public Exams-2023,Mango News,Mango News Telugu,Ts Inter Exam Fee Dates 2023,Ts Inter Exam Fee Dates,Ts Inter Exam Fee Dates,Ts Intermediate Exam Fee ,Ts Bie Notifies Due Dates,Ts Intermediate,Ts Inter Exam 2023,Ts Intermediate Supply Exam

తెలంగాణ రాష్ట్రంలో మార్చి,2023లో జరగనున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు సంబంధించిన ఫీజు చెల్లింపు తేదీలను ఇంటర్ బోర్డు తాజాగా ప్రకటించింది. ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం రెగ్యులర్ విద్యార్థులు, జనరల్ మరియు ఒకేషనల్ కోర్సుల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు, హాజరు మినహాయింపు పొందిన ప్రైవేట్ అభ్యర్థులు మార్చి,2023 వార్షిక పరీక్షల కోసం నవంబర్ 14వ తేదీ నుంచి నవంబర్ 30 తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చని తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్ నిర్దేశించిన గడువు తేదీల ప్రకారం మాత్రమే వారి కార్యాలయంలో పరీక్ష రుసుమును వసూలు చేయడానికి ఏర్పాటు చేయాలని మరియు గడువు తేదీలలో లేదా అంతకు ముందే ఆన్‌లైన్ నెట్ బ్యాంకింగ్ ద్వారా బోర్డుకు చెల్లించాలని సూచించారు. ఏ విద్యార్థినీ కూడా వారి పరీక్ష ఫీజును వ్యక్తిగతంగా ఆన్లైన్ లో చెల్లించడానికి అనుమతించకూడదన్నారు. ఫీజు చెల్లింపుకు సంబంధించిన పూర్తి వివరాలను https://tsbie.cgg.gov.in/ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు.

తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలు-2023 ఫీజు చెల్లింపుల వివరాలు:

  • ఫీజు చెల్లింపు ప్రారంభమైన తేదీ : నవంబర్ 14
  • ఫీజు చెల్లింపు తుది గడువు : నవంబర్ 30 (ఆలస్య ఫీజు లేకుండా)
  • రూ.100 ఆలస్య ఫీజుతో చెల్లింపు గడువు: డిసెంబర్ 2 నుంచి డిసెంబర్ 6 వరకు
  • రూ.500 ఆలస్య ఫీజుతో చెల్లింపు గడువు: డిసెంబర్ 8 నుంచి డిసెంబర్ 12 వరకు
  • రూ.1000 ఆలస్య ఫీజుతో చెల్లింపు గడువు: డిసెంబర్ 14 నుంచి డిసెంబర్ 17 వరకు
  • రూ.2000 ఆలస్య ఫీజుతో చెల్లింపు గడువు: డిసెంబర్ 19 నుంచి డిసెంబర్ 22 వరకు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − fifteen =