బిల్కిస్ బానో కేసులో 11 మంది దోషులను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేయడంపై స్పందించిన మంత్రి కేటీఆర్

Telangana Minister KTR Responds Over Gujarat Govt Released 11 Convicts of Bilkis Bano Case, KTR Responds Over Gujarat Govt Released 11 Convicts of Bilkis Bano Case, Gujarat Govt Released 11 Convicts of Bilkis Bano Case, 11 Convicts Released, Bilkis Bano Case, Telangana Minister KTR, Bilkis Bano Case News, Bilkis Bano Case Latest News And Updates, Bilkis Bano Case Live Updates, Mango News, Mango News Telugu,

తెలంగాణ మంత్రి కేటీఆర్ మరోసారి బీజేపీ సర్కార్ విధానాలపై మరియు ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై విమర్శలు చేశారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్‌లో.. బిల్కిస్ బానో కేసులో 11 మంది నిందితులను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేయడంపై స్పందించారు. గుజరాత్ ప్రభుత్వ రిమిషన్ ఆర్డర్‌ను రద్దు చేయాలని నేను మిమ్మల్ని కోరుతున్నానని కేటీఆర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇది కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాలకు విరుద్ధమని ఆరోపించారు. కేంద్రం జారీ చేసిన ఇటీవలి పాలసీ మార్గదర్శకాల ప్రకారం రేపిస్టులకు అటువంటి ఉపశమనం ఇవ్వకూడదని పేర్కొందని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు.

అలాగే ఇతర ప్రతిపక్ష పార్టీలు మరియు మానవ హక్కుల కార్యకర్తల డిమాండ్ ప్రకారం ఆ దోషుల విడుదలపై ప్రధాని మోదీ జోక్యం చేసుకోవాలని మంత్రి కోరారు. దీనిపై ఆయన ‘మీరు నిజంగా మహిళలను గౌరవిస్తుంటే, బిల్కిస్ బానో దోషుల విడుదల విషయంలో మీ చిత్తశుద్ధి నిరూపించుకోండి’ అని ప్రధాని మోదీకి మంత్రి కేటీఆర్ సూచించారు. అయితే దీనిపై ప్రతిపక్షాల విమర్శల నేపథ్యంలో గుజరాత్ ప్రభుత్వం స్పందించింది. 1992 పాలసీ ప్రకారం ఈ కేసులో విడుదల అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోవాలని సుప్రీం కోర్టు కోరడంతో ఆ మార్గదర్శకాలకు సాంకేతికంగా కట్టుబడి లేదని తెలిపింది.

అసలు ఈ ‘బిల్కిస్ బానో’ కేసు ఏంటి?

2002వ సంవత్సరం ఫిబ్రవరి 27న సబర్మతి ఎక్స్‌ప్రెస్ కోచ్‌ని తగులబెట్టి 59 మంది ‘కర సేవకులను’ కాల్చివేసిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున హింస చెలరేగిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఐదు నెలల గర్భిణి అయిన ‘బిల్కిస్ బానో’ అనే మహిళ తన కుమార్తెతో పాటు కుటుంబ సభ్యులు, ఇతర సన్నిహితులు మొత్తం 15 మందితో కలిసి తన గ్రామం నుండి పారిపోయి గ్రామం బయట ఒక పొలంలో ఆశ్రయం పొందింది. అయితే ఆయుధాలు చేతపట్టిన సుమారు 20-30 మంది వ్యక్తుల గుంపు వారిపై దాడి చేయడమే కాకుండా, బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం చేశారు. అలాగే ఈ ఘటనలో ఆమె కుటుంబంలోని ఏడుగురు వ్యక్తులు హత్య చేయబడ్డారు. మరో ఆరుగురు సభ్యులు అక్కడి నుంచి పారిపోయి తప్పించుకున్నారు.

అయితే ఈ వార్త రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో సుప్రీంకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది. ఈ కేసులో ప్రమేయం ఉన్న నిందితులందరినీ 2004లో అరెస్టు చేసి విచారణ జరిపారు. అనంతరం జనవరి 21, 2008లో పదకొండు మంది నిందితులకు ప్రత్యేక సిబిఐ కోర్టు జీవిత ఖైదు విధించింది. అయితే తాజాగా స్వతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా.. గుజరాత్ ప్రభుత్వం ఈ 11 మంది దోషులకు క్షమాభిక్ష ప్రసాదించి జైలు నుంచి విడుదల చేసింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలు ఈ నిర్ణయాన్ని తప్పు పడుతున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here