తెలంగాణ రాష్ట్రంలో మద్యం దుకాణాలు, బార్ల లైసెన్సు గడువు నెల రోజులు పొడిగింపు

Bars and Liquor Shops Licences for One More Month, Bars’ licences extended by a month, Govt Extends Bars and Liquor Shops Licences for One More Month, Liquor shops licence extended by one month, Liquor shops licence extended by one month in Telangana, Liquor Shops Licences Extended, Mango News, telangana, Telangana Govt Extends Bars and Liquor Shops Licences, Telangana Govt Extends Bars and Liquor Shops Licences for One More Month, Telangana Liquor Shops Licences

రాష్ట్రంలో మద్యం దుకాణాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏ-4 మద్యం దుకాణాల లైసెన్స్‌ గడువు నవంబరు నెల 30 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే రాష్ట్రంలో బార్ల లైసెన్సును అక్టోబర్‌ 31వరకు పొడిగించారు. ఈ మేరకు ఆబ్కారీ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా సెకండ్ వేవ్ తో ఏర్పడ్డ పరిస్థితులు కారణంగా దుకాణాలు నెలపాటు మూత పడటం, ఇతర సంబంధిత పరిగణనలోకి తీసుకుని లైసెన్స్‌ గడువు నెలరోజుల పాటుగా పొడిగించినట్టు తెలుస్తుంది.

ప్రస్తుతం నిర్వహిస్తున్న ఏ-4 మద్యం దుకాణాల లైసెన్సుల గడువు అక్టోబర్ 31వ తేదీతో ముగియనుంది. దీంతో నవంబర్ 1వ తేది నుండి నూతన ఎక్సైజ్ పాలసీ అమల్లోకి రావాల్సి ఉంది. అయితే మద్యం దుకాణాల కేటాయింపులో గౌడ కులస్థులకు, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ ఇటీవలే తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నూతన ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన విధి విధానాల ఖరారుపై కసరత్తు జరుగుతుంది. ఈ క్రమంలో ప్రస్తుతం ఉన్న దుకాణదారులకే మరో నెలపాటుగా నవంబర్ 30 వరకు లైసెన్స్ గడువు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో బార్ ల లైసెన్సుల గడువు సెప్టెంబర్ 30వ తేదీతో ముగుస్తున్న నేపథ్యంలో 2021-22 సంవత్సరానికి గాను నూతన బార్స్ లైసెన్స్ లకు సంబంధించిన విధానంపై చర్చిస్తున్నారు. దీంతో బార్ల లైసెన్స్ కూడా నెలరోజుల పొడిగింపుతో అక్టోబర్‌ 31 వరకు కొనసాగనున్నాయి.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − ten =