తెలంగాణలో నూతన రేషన్ కార్డుల జారీ ప్రక్రియ వేగవంతం

Mango News, New Pensions and Ration Cards, New Ration Cards Verification Process, pending ration card, pending ration cards in telangana, telangana, Telangana govt to begin processing of pending ration card, Telangana New ration cards soon, Telangana New Ration Cards Verification Process, Telangana Ration Card List, Telangana Ration Card List 2021, Telangana Ration Card List 2021 Status

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాలకు అనుగుణంగా నూతన రేషన్ కార్డుల జారీ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఇప్పటికే ఎన్ఐసి, టిఎస్ టిఎస్ వెరిఫికేషన్ పూర్తయి జిల్లాల వారీగా జరుగుతున్న ధ్రువీకరణ ప్రక్రియ చాలా వేగంగా జరుగుతుంది. ఈ అంశంపై రాష్ట్ర బిసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ హైదరాబాద్ లోని తన కార్యాలయంలో బుధవారం నాడు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 4,15,901 అప్లికేషన్ల విచారణ తుదిదశకు చేరుకుందని, అత్యంత త్వరలోనే లబ్దీదారులను గుర్తించి వీలైనంత త్వరగా వారికి కార్డులతో పాటు రేషన్ ఒకేసారి అందించే విదంగా చర్యలు తీసుకోవాలని మంత్రి పౌరసరఫరాల శాఖ అధికారులను ఆదేశించారు.

“గత పదిహేను రోజులుగా జిల్లా స్థాయిలో రెవెన్యూతో పాటు ఇతర సిబ్బంది, రాజదానిలో జిహెచ్ఎంసీతో పాటు ఇతర సిబ్బంది నిర్విరామంగా విధులు నిర్వహిస్తున్నారని, ప్రతీ అర్హుడిని గుర్తించడం కోసం జిల్లా కలెక్టర్లు, డిసిఎస్వోలు, పౌరసరఫరాల శాఖ సిబ్బంది పూర్తి స్థాయి చర్యలు తీసుకుంటున్నారు. నూతన కార్డుల జారీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై ఎంత భారం పడినా సిద్దంగా ఉన్నామని, సీఎం కేసీఆర్ ప్రతీ పేదవాని ఆకలిని తీర్చడానికే నిరంతరం కృషి చేస్తున్నారు” అని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four − one =