కాంగ్రెస్ హైకమాండ్ కీలక నిర్ణయం

Until Then Revanth Redde Was The Boss Of TPCC, Until Then Revanth Redde, The Boss Of TPCC, Revanth Redde Was The Boss Of TPCC, Revanthh Redddy, TPCC Chief, Congress Highcommand, T Congress, TPCC Chief News, Latest TPCC Chief News Updates, TS CM Revanth Reddy, Telangana, Congress, Sonia Gandhi, Polictical News, Assembly Elections, Mango News, Mango News Telugu
Revanthh redddy, TPCC Chief, Congress Highcommand, T.Congress

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ముందుండి నడిపించారు రేవంత్ రెడ్డి. అసలు రాష్ట్రంలో ఉణికి కోల్పోయిన పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చి.. కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చారు. బీఆర్ఎస్, బీజేపీ వ్యూహాలను తిప్పికొట్టి కాంగ్రెస్‌ను గెలిపించారు. అయితే అటు కాంగ్రెస్ హైకమాండ్ కూడా రేవంత్ రెడ్డి కష్టాన్ని, పట్టుదలను గుర్తించి ఆయనకే అగ్రపీఠాన్ని అప్పగించింది. ఎంతో మంది సీనియర్లను, దిగ్గజ నేతలను పక్కన పెట్టి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టింది.

త్వరలో అత్యంత కీలకమైన పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈసారి ఎలాగైనా ఢిల్లీలో జెండా ఎగురవేయాలని కాంగ్రెస్ హైకమాండ్ ముందుకు కదులుతోంది. ఈక్రమంలో తెలంగాణపై హైకమాండ్ కోటి ఆశలు పెట్టుకుంది. తెలంగాణలో మెజార్టీ పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకోవాలని అధిష్టానం భావిస్తోంది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే.. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మెజార్టీ స్థానాలను దక్కించుకోవాలంటే ఓ బలమైన నేత అవసరం ఎంతో ఉంది. అందుకే కాంగ్రెస్ హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకుందట. రేవంత్ రెడ్డికే మరోసారి టీపీసీసీ బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించిందట.

మరో ఆరు నెలల పాటు టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని కొనసాగించాలని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకుందట. ఈ విషయాన్ని పార్టీ సీనియర్ నేత మధు యాష్కీ వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల వేళ ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా.. ఎన్ని సమస్యలొచ్చినా ప్రత్యర్థులను దీటుగా ఎదుర్కొని పార్టీని విజయతీరాలకు చేర్చారు రేవంత్ రెడ్డి. తెలంగాణలో కాంగ్రెస్‌ను గెలిపించి తీరారు.

ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మెజార్టీ స్థానాలు దక్కాలంటే.. అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఉంటేనే సాధ్యమని హైకమాండ్ భావిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే.. పార్లమెంట్ ఎన్నికల సమయంలో కూడా రేవంత్ రెడ్డి దూకుడు ప్రదర్శిస్తారని హైకమాండ్ భావిస్తోంది. అందుకే సీనియర్లను పక్కన పెట్టి.. మరోసారి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డికి టీపీసీసీ బాధ్యతలు అప్పగించాలని హైకమాండ్ భావిస్తోందట.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × two =