బసవతారకం క్యాన్స‌ర్ ఆసుపత్రి 22వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న మంత్రి హరీశ్ రావు, నందమూరి బాలకృష్ణ

Minister Harish Rao Balakrishna Participates in Basavatarakam Cancer Hospital 22nd Foundation Day Celebrations, Nandamuri Balakrishna Participates in Basavatarakam Cancer Hospital 22nd Foundation Day Celebrations, Balakrishna Participates in Basavatarakam Cancer Hospital 22nd Foundation Day Celebrations, Minister Harish Rao Participates in Basavatarakam Cancer Hospital 22nd Foundation Day Celebrations, Telangana Minister Harish Rao Participates in Basavatarakam Cancer Hospital 22nd Foundation Day Celebrations, Harish Rao Participates in Basavatarakam Cancer Hospital 22nd Foundation Day Celebrations, Basavatarakam Cancer Hospital 22nd Foundation Day Celebrations, Basavatarakam Cancer Hospital Foundation Day Celebrations, 22nd Foundation Day Celebrations, Basavatarakam Cancer Hospital, Nandamuri Balakrishna, Balakrishna, Hero Balakrishna, Actor Balakrishna, Telangana Finance Minister Harish Rao, Telangana Minister Harish Rao, Finance Minister Harish Rao, Minister Harish Rao, Harish Rao, Basavatarakam Cancer Hospital 22nd Foundation Day Celebrations News, Basavatarakam Cancer Hospital 22nd Foundation Day Celebrations Latest News, Basavatarakam Cancer Hospital 22nd Foundation Day Celebrations Latest Updates, Basavatarakam Cancer Hospital 22nd Foundation Day Celebrations Live Updates, Mango News, Mango News Telugu,

బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ 22వ వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిధిగా తెలంగాణ వైద్యారోగ్య శాఖమంత్రి హరీశ్ రావు హాజరయ్యారు. బుధవారం జరిగిన ఈ వేడుకల్లో బసవతారకం క్యాన్స‌ర్ ఆసుపత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ, బోర్డ్‌ సభ్యులు ఎంపీ నామా నాగేశ్వరరావు, జెఎస్ఆర్ ప్రసాద్‌, సీఈఓ డాక్టర్ ప్రభాకర్ రావు, ఇతర సభ్యులు, ఆసుపత్రి వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ, ఫౌండేషన్‌ డే సందర్భంగా ఈ వేడుకల్లో మంత్రి హరీశ్ రావు పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అందరికీ అందుబాటులో ఉండి, ఆప్యాయంగా పలుకరించే నాయకుడిగా, ట్రబుల్‌ షూటర్‌గా పేరుపొందిన హరీశ్ రావు తనకు అప్పజెప్పిన ఎలాంటి బాధ్యతలనైనా ఎంతో సమర్ధవంతంగా నిర్వహించగలరని పేర్కొన్నారు. ఈ ఆసుపత్రి ప్రారంభించి 22 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాము. ఈ సంవత్సరం ఎంతో ప్రత్యేకమైనదని, ఈ ఆసుపత్రిని ప్రారంభించిన తన తండ్రి స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్న సంవత్సరం ఇదని బాలకృష్ణ తెలిపారు.

“22 సంవత్సరాల క్రితం చాలా కొద్ది మందిలో మాత్రమే కనిపించిన ఈ క్యాన్సర్‌ మహమ్మారి, ఈ రోజు కొన్ని లక్షల మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ఆ రోజు ఎంతో ఉన్నత ఆశయంతో స్థాపించిన ఈ ఆసుపత్రి అనే మొక్క ఈ రోజు మహావృక్షమై కొన్ని వేల మందికి నీడనిస్తూ కొన్ని లక్షల మందికి స్వాంతన చేకూరుస్తుంది. ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్యులను, సిబ్బందిని అభినందిస్తున్నాను. అలాగే బసవతారకరామారావు మెమోరియల్‌ క్యాన్సర్‌ ఫౌండేషన్, ఇండో-అమెరికన్‌ క్యాన్సర్‌ ఆర్గనైజేషన్‌ సహకారం, ఎంతోమంది దాతల తోడ్పాటు, ఇరు రాష్ట ప్రభుత్వాల సహకారంతో గత 22 సంవత్సరాలుగా క్యాన్సర్‌ రోగుల సేవలో పునీతమవుతూనేె వుంది. క్యాన్సర్‌ పై పోరాడుతున్న వారందరికీ అభినందనలు మరియు క్యాన్సర్‌ని జయించిన వారందరు మనందరికి స్ఫూర్తి ప్రధాతలే. ఇప్పటికి క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ ద్వారా 3 లక్షలకుపైగా ప్రజలని స్కీన్‌ చేయడం జరిగింది. కొన్ని వేల మందికి ఉచితంగా చికిత్సను అందించడం జరిగింది. దాతలు ఇస్తున్న విరాళాలు ఈ ఆసుపత్రి అభివృద్దిలో ఎంతగానో తోడ్పడుతున్నాయి. మరోవైపు బిల్డింగ్ రెగ్యులేషన్ పనుల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వాన్ని కలిసినప్పుడు సుమారు ఆరు కోట్ల బకాయిలను రద్దు చేశారు. గౌతమపుత్ర శాత‌క‌ర్ణి సినిమా విడుద‌ల స‌మ‌యంలో కూడా ఉదయం అడ‌గ్గానే సాయంత్రానికి సీఎం కేసీఆర్ ప‌న్ను మిన‌హాయింపు ఇచ్చారు” అని బాలకృష్ణ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ, లాభాపేక్ష లేకుండా పేదలకు సేవ చేస్తున్న అతి కొద్ది ఆసుపత్రుల్లో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ఒకటని అన్నారు. ఎన్టీఆర్​ అంటే కేసీఆర్​కు ఎనలేని అభిమానమని చెప్పారు. బీఆర్ఎస్ కింద ఈ ఆసుపత్రికి సంబంధించి సీఎం కేసీఆర్ రూ.6 కోట్లు మాఫీ చేశారని, గతంలో ఏ సీఎం కూడా ఇలా చేయలేదన్నారు. బసవతారకం ఆసుపత్రికి ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికి క్యాన్సర్ బాధితుల కోసం రూ.750 కోట్లకు పైగా ఖర్చు చేసిందని, తెలంగాణ డియాగ్నోస్టిక్స్ సెంటర్స్ ద్వారా 35 ఏళ్లు పైబడిన వారికి క్యాన్సర్ స్క్రీనింగ్ చేయనున్నట్టు మంత్రి హరీశ్‌ రావు తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × one =