టీపీసీసీ చీఫ్ రేవంత్ గృహనిర్బంధం

, Mango News, Rachabanda Programme, Revanth Reddy House Arrested, Revanth Reddy House Arrested in the View of Rachabanda Programme, Revanth Reddy Rachabanda, Revanth Reddy Rachabanda at Bhupalpally, Telangana, Telangana Congress leader Revanth Reddy, TPCC Chief A Revanth Reddy Under House Arrest Amid Rachabanda Programme, TPCC Chief Revanth Reddy, TPCC Chief Revanth Reddy House Arrested in the View of Rachabanda Programme, TPCC President A Revanth Reddy Under House Arrest, TPCC President A Revanth Reddy Under House Arrest Security Tightened At Residence, TPCC President Revanth Reddy house arrested

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసం వద్ద పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈరోజు సాయంత్రం వరంగల్ జిల్లా భూపాలపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తోన్న రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనేందుకు రేవంత్ సన్నాహాల్లో ఉన్నారు. అయితే, రేవంత్ రెడ్డిని ఈ కార్యక్రమానికి వెళ్లనివ్వకుండా అడ్డుకునేందుకు పోలీసులు ఈ రోజు ఉదయమే ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు. రచ్చబండ కార్యక్రమానికి అనుమతి లేదని.. రేవంత్ రెడ్డి సహకరించాలని పోలీసులు కోరుతున్నారు. ఈ సందర్భంగా పోలీసులపై రేవంత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు అనుమతి లేదు అంటున్నారని.. కానీ, పోలీసులు మాత్రం అనుమతి లేకుండా తన ఇంట్లోకి ఎలా వచ్చారని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు.. ఈ రోజు ఉదయం నుంచే ఆయన ఇంటి వద్ద మోహరించి, రేవంత్ ఇంటివద్ద బారికేడ్లు అడ్డుగా ఉంచారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − 15 =