‘లైగర్’ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ – విజయ్ దేవరకొండ ఫాన్స్ ఫుల్ జోష్

First glimpse from Vijay Devarakonda Liger, First glimpse from Vijay Devarakonda Liger is out, Liger first glimpse, Mango News, Rowdy Vijay Deverakonda is back, Vijay Devarakonda Liger, Vijay Devarakonda Liger Movie, Vijay Devarakonda Liger Movie First Glimpse, Vijay Devarakonda Liger Movie First Glimpse Released, Vijay DevaraKonda starrer Liger, Vijay DevaraKonda starrer Liger first glimpse, Vijay Deverakonda

రౌడీబాయ్ గా ఫాన్స్ ముద్దుగా పిలుచుకునే టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ కొత్త సంవత్సరానికి ఒక్కరోజు ముందు అభిమానులకు ఒక సర్ప్రైజ్ ఇచ్చాడు. ‘అర్జున్ రెడ్డి’, ‘గీతగోవిందం’ తర్వాత మళ్లీ ఆ స్థాయి విజయాలు అందుకోలేకపోయిన విజయ్ దేవరకొండ.. తాజాగా తాను నటిస్తోన్న తొలి యాక్షన్ ఎంటర్ టైనర్ ‘లైగర్’ మూవీ నుంచి ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. కిక్ బాక్సింగ్ నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రానికి టాలీవుడ్ టాప్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా గ్లింప్స్, టీజర్ల కోసం అభిమానులు ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తున్నారు. ఈ నేపధ్యంలో నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ శుక్రవారం ఉదయం ‘లైగర్’ ఫస్ట్ గ్లింప్స్ ని చిత్రబృందం సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది.

పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండకు జోడీగా అనన్యపాండే నటిస్తోంది. ప్రముఖ బాక్సర్ మైక్ టైసన్ ఈసినిమాలో నటించటం ఒక విశేషం. ‘వి ఆర్ ఇండియన్స్’ అంటూ విజయ్ చెప్పే డైలాగ్స్, యాక్షన్ ఎపిసోడ్స్ సూపర్ గా ఉన్నాయి. “లేడీస్ అండ్ జెంటిల్మేన్.. మీ అందరూ వెయిట్ చేస్తోన్న రోజు వచ్చేసింది. MMA World Cup పోటీలు స్టార్ట్ అయ్యాయి. ముంబయి వీధుల్లో పెరిగిన స్లమ్ డాగ్, చాయ్ వాలా… ది లైగర్ అంటూ విజయ్ దేవరకొండని పరిచయం చేసే సన్నివేశాలతో ప్రారంభమైన గ్లింప్స్ ఆసాంతం అద్భుతంగా సాగింది. ఛార్మీ, కరణ్ జోహర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 + eight =