జాతీయ ఆరోగ్య సూచికల్లో 3వ స్థానంలో తెలంగాణ, సత్పలితాలనిస్తున్న ప్రభుత్వ ఆరోగ్య సంరక్షణ చర్యలు

Telangana Ranked 3rd In National Health Index, Govt Health Care Measures To Improve, National Health Index , Ministry of Health And Family Welfare, NITI Aayog, National Health Mission, National Health Index 2022, Ministry of Health and Family Welfare, Telangana Health Sector, Telangana Health Latest News And Updates, Health Indicators, Indicators Of Health, National Health Mission, The Health Indicators, Telangana Health News And Latest Updates

రాష్ట్రంలో చేపడుతున్న ఆరోగ్య సంరక్షణ చర్యలు సత్పలితాలు ఇస్తున్నాయని, జాతీయ ఆరోగ్య సూచికల్లో తెలంగాణ రాష్ట్రం 3వ స్థానంలో నిలిచిందని తెలంగాణ ఆరోగ్యశాఖ తెలిపింది. ఈ మేరకు అన్ని ఆరోగ్య సంరక్షణ చర్యల వివరాలతో ఒక ప్రకటన విడుదల చేసింది. “ఒకనాడు నేను రాను బిడ్డో సర్కారు ధవాఖానాకు అన్నట్లు వుండే ప్రభుత్వ ఆసుపత్రులు తీరు నేడు పూర్తిగా మారాయి. ప్రభుత్వ వైద్యం పట్ల ప్రజల నమ్మకం, విశ్వాసం పెరిగింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కు ప్రజల ఆరోగ్యం పట్ల ఉన్న శ్రద్ధతో రాష్ట్రం ఆరోగ్య తెలంగాణగా ఆవిర్బవిస్తున్నది. గత ఎనిమిది ఏండ్లుగా ప్రభుత్వం చేపట్టిన బహుముఖ చర్యలతో జాతీయ ఆరోగ్య సూచికల్లో 3వ స్థానానికి చేరుకుంది. ఆరోగ్య సబ్ సెంటర్ల నుంచి ప్రాధమిక, ఏరియా, జిల్లా, భోధన, రాష్ట్ర స్థాయి ప్రభుత్వ ఆసుపత్రులలో ఆధునిక వైద్య సేవలను ప్రభుత్వం పటిష్టపరిచింది. ప్రభుత్వ ఉచిత వైద్య సేవలు, టెస్ట్ లను విస్తృతం చేయుటకు వ్యవస్థాపరమైన వసతులను అభివృద్ధి చేసింది. దీనితో పేదలు, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యమంత్రి ఆకాంక్షాలకు అనుగుణంగా పౌరుల ఆరోగ్య స్థితి మెరుగుపడింది. ముఖ్యంగా మహిళలు, పిల్లలు ముఖ్య ఆరోగ్య సూచికల్లో గణనీయ ప్రగతి కనిపిస్తుంది” అని చెప్పారు.

“రాష్ట్రం ఏర్పడక ముందు 92గా ఉన్న మాతృ మరణాల రేటు (ఎంఎంఆర్‌), నేడు 56కి తగ్గింది. శిశు మరణాల రేటు (ఐఎంఆర్‌) 39 నుండి 21 కి తగ్గింది. 5 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న పిల్లల మరణాల రేటు (యూఎస్ఎంఆర్) 41 నుంచి 30 కు, నవజాత శిశు మరణాల రేటు (ఎన్ఎంఆర్‌) 25 నుండి 17కి తగ్గింది. నీతి ఆయోగ్ వెల్లడించిన నివేదిక ప్రకారం ఆరోగ్య సూచికల్లో దేశంలో కేరళ, తమిళనాడు తర్వాత తెలంగాణ రాష్ట్రం 3వ స్థానంలో నిలిచింది. కేసీఆర్ కిట్ ద్వారా 2017 నుండి ఇప్పటివరకు 13,29,951 మంది లబ్ధిపొందారు. రూ.1,176 కోట్లు డీబీటీ ద్వారా లబ్ధిదారుల ఖాతాలకు ప్రభుత్వం బదిలీ చేసింది. 102 రిఫరల్ ట్రాన్స్‌పోర్ట్ ద్వారా 41 లక్షల మంది గర్భిణులు రవాణా సదుపాయం పొందారు. ప్రతి బిడ్డ ఆరోగ్యంగా పుట్టి, ఎదిగేందుకు ప్రభుత్వం గట్టి ప్రయత్నాలు చేస్తోంది. యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ కింద రాష్ట్రంలో 99% లక్ష్యాన్ని సాధించింది. 35 ప్రత్యేక నవజాత సంరక్షణ యూనిట్లు ప్రస్తుతం పనిచేస్తున్నాయి. లేబర్ రూమ్ ల సమీపంలో ఏర్పాటు చేసిన ఈ యూనిట్ల ద్వారా అనారోగ్యంతో ఉన్న నవజాత శిశువులకు సరైన ప్రత్యేక సంరక్షణ సేవలు సకాలంలో అందుబాటులోకి వచ్చాయి. పట్టణ పేదలకు నాణ్యమైన ఆరోగ్య సేవలను అందించడానికి జీహెఛ్ఎంసీ ప్రాంతంలో 259 బస్తీ దవాఖానాలు పని చేస్తున్నాయి. బస్తీదవాఖానాలలో 195 రకాల మందులు, 57 రకాల ల్యాబ్ పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. ఉచిత డయాగ్నోస్టిక్ కేంద్రాలు ద్వారా హబ్ అండ్ స్పోక్ మోడల్ కింద రక్త పరీక్షలు, ఈసీజీ మరియు ఎక్స్-రే, యూఎస్జీ డయాగ్నస్టిక్ సేవలను ప్రభుత్వం అందిస్తున్నది. ప్రస్తుతం 20 జిల్లాల్లో ఈ టెస్ట్ లాబ్స్ ఉన్నాయి. మరో 13 ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తున్నాం” అని తెలిపారు.

“ప్రతి నెలా దాదాపు 4 లక్షల శాంపిళ్లను ఈ టెస్ట్ లాబ్స్ లో పరీక్షిస్తున్నారు. ప్రస్తుతం హబ్‌లు పాథాలజీ, రేడియాలజీ, వైరాలజీ సేవలను కూడా అందిస్తున్నాయి. వీటితో పాటు సెకండరీ హెల్త్ కేర్ సర్వీసెస్ ను ప్రభుత్వం విస్తృత పరిచింది. సెకండరీ కేర్‌లో 10,170 పడకలతో 175 ఆసుపత్రులు సెకండరీ హెల్త్ కేర్ సేవలను అందిస్తున్నది. తృతీయ ఆరోగ్య సంరక్షణ సేవలు, వైద్యవిద్యను ప్రజలకు చేరువచేసింది. రాష్ట్రంలో ప్రతి జిల్లాకు ప్రభుత్వ వైద్య కళాశాల ఉండేల జిల్లాలకు వైద్య కళాశాలను ప్రభుత్వం మంజూరు చేసింది. వైద్య కళాశాలలకు అనుబంధంగా ఉన్న ప్రభుత్వ జిల్లా ఆసుపత్రులలో అదనపు వసతులను ప్రభుత్వం కల్పిస్తుంది. 2021 మే 18న ఏబీ-పీఎంజేఏవై స్కీమ్‌తో ఆరోగ్యశ్రీని ప్రభుత్వం అనుసంధానించింది. తద్వారా 87.5 లక్షల కుటుంబాలకు లబ్ది చేకూరుతుంది. ఆరోగ్యశ్రీ కింద రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి 25 లక్షలకు పైగా శస్త్రచికిత్సలు జరిగాయి. తద్వారా 13 లక్షలకు పైగా పేషెంట్స్ లబ్ధిపొందారు” అని అన్నారు.

రాష్ట్రంలో 57 ప్రభుత్వ రక్తనిధి కేంద్రాలు, 17 రక్త నిల్వ కేంద్రాలు ఉచితంగా సేవలు అందిస్తున్నాయి. 27 బ్లడ్ బ్యాంకుల్లో కాంపోనెంట్ సెపరేటర్లు ఉన్నాయి. ప్రభుత్వ వైద్య ఆరోగ్య సేవలను మెరుగుపరిచేందుకు కొత్త ఇంటిగ్రేటెడ్ హాస్పిటల్ ఫెసిలిటీ మేనేజ్‌మెంట్ సర్వీసెస్‌ను ప్రవేశపెట్టింది. ఈ విధానంలో భాగంగా డైట్ ఛార్జీలను రెట్టింపు చేసి కొత్త డైట్ మెనూను ప్రవేశపెట్టారు. కొత్త ఔషధ విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. రూ.61 కోట్ల అంచనా వ్యయంతో 29 బోధనాసుపత్రులు, 20 జిల్లా ఆసుపత్రులు, 30 ఆసుపత్రులు/సీహెఛ్సీలలో ఎలక్ట్రికల్ సేఫ్టీ పనులు మంజూరు చేయబడ్డాయి. ఈ పనులు పురోగతిలో ఉన్నాయి. రూ.61 కోట్లతో 20 ఆసుపత్రుల్లో మురుగునీటి శుద్ధి ప్లాంట్లు (ఎస్టీపీ) మంజూరు అయ్యాయి. రూ.31 కోట్ల అంచనా వ్యయంతో 153 ఇతర ఆసుపత్రుల్లో ఫైర్ సేఫ్టీ పనులు మంజూరయ్యాయి. 61 ఆసుపత్రుల్లో మార్చురీల మరమ్మత్తు, పునరుద్ధరణ మరియు అప్‌గ్రేడేషన్ పనులను ప్రభుత్వం మంజూరు చేసింది. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా 12,755 ఖాళీలను భర్తీ చేయడానికి మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్, తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్‌కు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ బహుముఖ చర్యలతో ప్రభుత్వ వైద్యం పట్ల ప్రజల్లో విశ్వాసం, నమ్మకం పెరిగింది” అని పేర్కొంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight + 10 =