వైఎస్సార్సీపీ శాశ్వత అధ్యక్ష పదవిపై స్పష్టతనిచ్చిన ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి

AP Govt Advisor Sajjala Ramakrishna Reddy Gives Clarity on CM Jagan Being YSRCP Lifetime President Issue, AP Govt Adviser Sajjala Ramakrishna Reddy , Clarified On The Post Of YSRCP Permanent President , YSRCP Permanent President, Sajjala Ramakrishna Reddy , Election Commission of India Orders YSRCP, ECI Orders YSRCP, CM Jagan Being Made Party Permanent President, CM Jagan Party Permanent President, YSRCP Permanent President, Mango News, Mango News Telugu, AP CM YS Jagan Mohan Reddy, YSR Congress Party, YSRCP Party President, ECI Latest News And Updates, YS Jagan News And Live Updates

వైఎస్సార్సీపీ శాశ్వత అధ్యక్ష పదవిపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి క్లారిటీ ఇచ్చారు. వైఎస్సార్సీపీ జీవితకాల అధ్యక్షుడిగా సీఎం జగన్‌ ఉండటాన్ని సీఈసీ ప్రశ్నించడంపై ఆయన వివరణ ఇచ్చారు. దీనిపై సజ్జల రామకృష్ణారెడ్డి గురువారం మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ శాశ్వత జాతీయ అధ్యక్షుడిగా సీఎం జగన్‌ను ఎన్నుకుంటూ ప్లీనరీలో తీర్మానం చేసిన సంగతి వాస్తవమేనని, అయితే ఈ తీర్మానాన్ని సీఎం జగన్ తిరస్కరించారని సజ్జల తెలిపారు. దీనివల్ల ఆ నిర్ణయం ప్లీనరీ మినిట్స్ లోకి ఎక్కలేదని ఆయన వివరణ ఇచ్చారు. అలాగే వచ్చే ఐదేళ్లపాటు సీఎం జగన్ అధ్యక్షుడిగా ఉంటారని, ఆ తర్వాత మరోసారి ఎన్నిక జరుగుతుందని సజ్జల వివరించారు. ఇక దీనికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ స్పష్టత ఇవ్వమని కోరిందని, త్వరలోనే దీనికి పార్టీ తరపున సమాధానం ఇస్తామని సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు.

కాగా గత జూలైలో జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ (వైఎస్సార్సీపీ) ఫ్లీనరీలో భాగంగా పార్టీ శాశ్వత జాతీయ అధ్యక్షుడిగా సీఎం జగన్‌ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) తాజాగా స్పందించింది. ఈ ఎన్నికను సీఈసీ నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తుందని, రాజకీయ పార్టీలోని ఏదైనా సంస్థాగత పదవి శాశ్వత స్వభావం కలిగి ఉండే ఏదైనా ప్రయత్నం లేదా సూచన కూడా సహజంగా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమని తెలిపింది. ఎన్నికల కాలవ్యవధిని తిరస్కరించే ఏ చర్య అయినా, ఎన్నికల సంఘం యొక్క ప్రస్తుత సూచనలను పూర్తిగా ఉల్లంఘిస్తుందని సీఈసీ స్పష్టం చేసింది. ఈ మేరకు సీఈసీ బుధవారం ఒక ప్రకటనను విడుదల చేసింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four − 4 =