హెఛ్సీయూ, మహబూబ్ నగర్ ఘటనలపై తెలంగాణ మహిళా కమిషన్ సీరియస్

Telangana Women Commission Chairman Sunitha Lakshmareddy Responds over HCU Mahabubnagar Incidents, Sunitha Lakshmareddy Responds over HCU And Mahabubnagar Incidents, Telangana Women Commission Chairman Sunitha Lakshmareddy, Sunitha Lakshmareddy, Telangana Women Commission Chairman, HCU And Mahabubnagar, HCU Incidents, Mahabubnagar Incidents, Vakiti Sunitha Lakshma Reddy, Dongli Mandal News, Dongli Mandal Latest News, Dongli Mandal Live Updates, Mango News, Mango News Telugu

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, మహబూబ్ నగర్ జిల్లా ఘటనలపై తెలంగాణ మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఉన్నత చదువుల కోసం థాయ్ లాండ్ నుండి హైదరాబాద్ కు వచ్చిన విద్యార్థినిపై హెఛ్సీయూ ప్రొఫెసర్ అత్యాచారయత్నానికి పాల్పడ్డ ఘటన మరియు మహబూబ్ నగర్ జిల్లా బాలనగర్ మండలంలో పదో తరగతి విద్యార్ధినిపై అత్యాచారం, హత్య ఘటనలను తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించిందని కమీషన్ కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. హెఛ్సీయూ ఘటనపై చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, తల్లి, తండ్రి, గురువు ఆ తర్వాతే దైవం అంటారు. అందుకే తల్లిదండ్రులు కూడా గురువులను నమ్మి ధైర్యంతో పిల్లలను స్కూళ్లకు, కాలేజీలకు పంపిస్తారు, కానీ విద్యా బుద్ధులు నేర్పాల్సిన గురువులు కొంతమంది తప్పుదోవ పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

అలాగే మహబూబ్ నగర్ జిల్లా బాలనగర్ మండలంలో పదో తరగతి విద్యార్ధిని ఘటనలో తండ్రి వరస అయ్యే వ్యక్తులే ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడటం విచారణకరం అని, మానవత్వం మంటకలిసిపోతుందనే దానికి మహబూబ్ నగర్ ఘటనే విషాదకరం అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి ఘటనలు జరగడం చాలా బాధాకరం అన్నారు. సమాజంలో మార్పుతో పాటు, కఠిన చర్యలు అమలు జరిగినప్పుడే ఇటువంటి ఘటనలకు అడ్డుకట్ట పడే అవకాశాలు ఉంటాయన్నారు. బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర మహిళా కమిషన్ అండగా ఉంటాయని చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి భరోసా ఇచ్చారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here