ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి బహిరంగ క్షమాపణ చెప్పిన టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి

TPCC Chief Revanth Reddy Express Apologies To Congress Senior Leader MP Komatireddy Venkat Reddy, Revanth Reddy Express Apologies To Congress Senior Leader MP Komatireddy Venkat Reddy, Apologies To Congress Senior Leader MP Komatireddy Venkat Reddy, Congress Senior Leader MP Komatireddy Venkat Reddy, TPCC Chief Revanth Reddy, MP Komatireddy Venkat Reddy, TPCC Chief Revanth Reddy Apologies, Komatireddy Venkat Reddy, Congress Senior Leader, MP Komatireddy Venkat Reddy News, MP Komatireddy Venkat Reddy Latest News And Updates, MP Komatireddy Venkat Reddy Live Updates, Mango News, Mango News Telugu,

కాంగ్రెస్‌లో మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి రాజీనామా వ్యవహారం, తదనంతర పరిణామాలు ఆ పార్టీలో కాక రేపుతున్నాయి. ఈ క్రమంలో పార్టీలోని కొంతమంది నాయకులు బహిరంగ సభలో తనను అవమానించిన సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి మండిపడిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో.. కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డికి రేవంత్ రెడ్డి బ‌హిరంగ క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. శనివారం ట్విట్ట‌ర్ వేదిక‌గా మాట్లాడిన రేవంత్ రెడ్డి, కోమ‌టిరెడ్డికి క్ష‌మాప‌ణ‌లు తెలిపారు. ఈ మధ్య పత్రికా సమావేశంలో హోంగార్డు ప్ర‌స్తావ‌న‌ మరియు చండూరు స‌భ‌లో కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్‌ కోమటిరెడ్డిపై చేసిన పరుష వ్యాఖ్యలకు కోమ‌టిరెడ్డి మనసు నొచ్చుకున్నందుకు క్ష‌మాప‌ణ‌లు చెబుతున్నట్లు అందులో వెల్లడించారు.

ఇటీవల జరిగిన కొన్ని సంఘటనల నేపథ్యంలో.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మనస్థాపం చెందారని, ఈ సందర్భంగా పీసీసీ అధ్యక్షుడుగా దీనికి బాధ్యత వహించాలని కోరుతూ ఆయన తనను క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారని, అందుకే బేషరతుగా ఆయనకు క్షమాపణలు చెబుతున్నానని రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటే తనకు చాలా గౌరవం ఉందని, తెలంగాణ సాధనలో ఆయన క్రియాశీలక పాత్ర పోషించారని అన్నారు. ఇలాంటి సంఘటనలు కానీ, భాష కానీ ఎవరికీ మంచిది కాదని చెప్పిన రేవంత్ రెడ్డి క్రమశిక్షణను ఉల్లంఘించిన అద్దంకి దయాకర్‌పై చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో తదుపరి చర్యల నిమిత్తం ఈ విషయాన్ని క్రమశిక్షణా కమిటీ ఛైర్మన్‌ చిన్నారెడ్డికి తెలియజేస్తానని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి వెల్లడించారు.

ఇక ఇదిలా ఉండగా.. దీనిపై కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్‌ స్పందించారు. ఇప్పటికే తన వ్యాఖ్యలకు వెంకట్ రెడ్డికి క్షమాపణలు చెప్పిన ఆయన శనివారం మరోసారి ఎంపీ కోమటిరెడ్డికి క్షమాపణలు తెలిపారు. ఈ సందర్భంగా దయాకర్‌ మాట్లాడుతూ.. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని, తనపై ఏ చర్య తీసుకున్నా శిరసావహిస్తానని స్పష్టం చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించి పార్టీ క్రమశిక్షణ కమిటీ తనకు షోకాజ్‌ నోటీసు జారీ చేసిందని, ఆ నోటీసులకు తాను వివరణ ఇచ్చానాని, ఎంపీకి క్షమాపణ కూడా చెప్పానని వెల్లడించారు. భవిష్యత్‌లో మరోసారి అలా జరగకుండా చూసుకుంటానని అద్దంకి దయాకర్‌ వివరం ఇచ్చారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × five =