మెడల్ ఫర్‌ ఎక్సలెన్స్‌ ఇన్‌ ఇన్వెస్టిగేషన్‌: ఐదుగురు ఏపీ, ఐదుగురు తెలంగాణ పోలీస్‌ అధికారులకు పురస్కారాలు

151 Police Officers Get Union Home Minister’s Medal for Excellence in Investigation for the Year 2022, Union Home Minister's Medal for Excellence in Investigation, 151 Police Officers Get Union Home Minister’s Medal, Excellence in Investigation for the Year 2022, 151 Police Officers, Union Home Minister's Medal, Excellence in Investigation, Central Investigation Agencies, Union Home Minister’s Medal News, Union Home Minister’s Medal Latest News And Updates, Union Home Minister’s Medal Live Updates, MHA Awards 2022, Mango News, Mango News Telugu,

2022 సంవత్సరానికి గాను కేంద్ర హోం మంత్రి మెడల్ ఫర్‌ ఎక్సలెన్స్‌ ఇన్‌ ఇన్వెస్టిగేషన్‌ దేశవ్యాప్తంగా మొత్తం 151 మంది పోలీసు అధికారులకు ప్రకటించబడింది. నేర పరిశోధనలో ఉన్నత వృత్తిపరమైన ప్రమాణాలను ప్రోత్సహించడం కోసం ఈ మెడల్ ను 2018 నుంచి కేంద్ర హోమ్ శాఖ అందిస్తుంది. ఈ అవార్డులను ప్రతి సంవత్సరం ఆగస్టు 12న ప్రకటిస్తున్నారు. ఈ అవార్డులు అందుకుంటున్న పోలీస్ అధికారుల్లో అత్యధికంగా సీబీఐ నుంచి 15 మంది, మహారాష్ట్ర నుంచి 11 మంది, ఉత్తర్ ప్రదేశ్ మధ్యప్రదేశ్ నుంచి 10 మంది, కేరళ, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల నుంచి ఎనిమిది మంది చొప్పున, బీహార్‌ నుంచి ఏడుగురు, గుజరాత్‌, కర్ణాటక, ఢిల్లీల నుంచి ఆరుగురు, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ), నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో నుంచి ఐదుగురు చొప్పున ఉన్నారు. అలాగే ఈ మెడల్ కు ఎంపికైన 151 మందిలో ఇరవై ఎనిమిది మంది మహిళా పోలీసు అధికారులు ఉన్నారు.

తెలంగాణ నుంచి పురస్కారాలు దక్కించుకున్న పోలీస్ అధికారులు:

  1. డీఎస్పీ పీ.వెంకటరమణ
  2. ఏసీపీ రుద్రవరం గండ్ల శివమారుతి
  3. ఇన్‌స్పెక్టర్‌ బీ.అంజిరెడ్డి
  4. డీఎస్పీ ఏ.గంగారామ్‌
  5. ఏసీపీ రఘు వెగ్గలం

ఆంధ్రప్రదేశ్ నుంచి పురస్కారాలు దక్కించుకున్న పోలీస్ అధికారులు:

  1. డిప్యూటీ ఎస్పీ బీ.సీతారామయ్య
  2. ఇన్‌స్పెక్టర్‌ కన్నూజు వాసు
  3. సబ్ ఇన్‌స్పెక్టర్‌ ఖాదర్ బాషా షేక్
  4. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీనివాసరావు కొల్లి
  5. ఇన్‌స్పెక్టర్‌ సత్యనారాయణ ముత్యాల.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here