తెలంగాణ రాష్ట్రానికి ఆచార్య జయశంకర్ ఐకాన్ లాంటి వారు: మంత్రి జగదీష్ రెడ్డి

Minister Jagadish Reddy Pays Tribute to Professor Jayashankar On His Death Anniversary, Tribute to Professor Jayashankar On His Death Anniversary, Minister Jagadish Reddy Pays Tribute to Professor Jayashankar, Telangana Minister Jagadish Reddy Pays Tribute to Professor Jayashankar, Jagadish Reddy Pays Tribute to Professor Jayashankar, Tribute to Professor Jayashankar, Professor Jayashankar, Telangana Energy Minister Jagadish Reddy, Minister Jagadish Reddy, Jagadish Reddy, Energy Minister Jagadish Reddy, Telangana Energy Minister, Jagadish Reddy Telangana Energy Minister, Professor Jayashankar Death Anniversary News, Professor Jayashankar Death Anniversary Latest News, Professor Jayashankar Death Anniversary Latest Updates, Professor Jayashankar Death Anniversary Live Updates, Mango News, Mango News Telugu,

తెలంగాణ రాష్ట్రానికి దివంగత ఆచార్య జయశంకర్ సార్ ఐకాన్ లాంటి వారని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు జీవిత చరమాంకం వరకు అవిశ్రాంతంగా పోరాటం చేసిన యోధుడు జయశంకర్ అని ఆయన పేర్కొన్నారు. ఆచార్య జయశంకర్ 11వ వర్ధంతిని పురస్కరించుకుని సూర్యపేట జిల్లా కేంద్రంలోని మంత్రి జగదీష్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణను ఆంద్రప్రదేశ్ లో కలిపిన రోజునే బలంగా వ్యతిరేకించిన యోధుడు జయశంకర్ సార్ అని ఆయన తెలిపారు. అటువంటి మహానుబావుడి సంకల్పసిద్ధికి అనుగుణంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనను కొనసాగిస్తున్నారన్నారు. ఈ రోజున సార్ జీవించి ఉంటే ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో తాను కన్న కలలు సాకారం అవుతున్నందుకు ఎంతగానే సంబురపడేవారని మంత్రి చెప్పారు.

తెలంగాణ వెనుకబాటుకు గురైన ప్రాంతం కాదని, వెనుకబాటుకు నెట్టివేయబడిన ప్రాంతమంటూ వేల సభలలో జయశంకర్ సార్ చేసిన ఉపన్యాసాలను మంత్రి జగదీష్ రెడ్డి గుర్తుచేశారు. అటువంటి సహజ వనరులను సద్వినియోగ పరుచుకొని ఎనిమిదేండ్ల పాలనలో యావత్ భారతదేశంలోనే తెలంగాణను ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు వరుసలో నిలబెట్టారన్నారు. అద్భుతమైన విజన్, అంతకుమించి చక్కటి పాలనను అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికతతోటే రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి సాదించిందన్నారు. ఇది ఎవరో చెబితే తెలిసింది కాదని ఎనిమిదేండ్ల ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనకు స్వయానా కేంద్రప్రభుత్వమే కితాబునివ్వడం ఇందుకు అద్దం పడుతుందన్నారు. కేంద్రప్రభుత్వం ప్రకటించిన అభివృద్ధి చెందిన గ్రామాల లిస్ట్ లో ఒకటి నుండి పందొమ్మిది వరకు తెలంగాణ రాష్ట్ర పల్లెలు ఉండడం, పట్టణాల వరుసలోను ఒకటి నుండి పది వరకు కేంద్రప్రభుత్వ లిస్ట్ లో ముందుండడమే ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనకు తార్కాణంగా మంత్రి జగదీష్ రెడ్డి అభివర్ణించారు. అంతకు మించి వేగవంతమైన వ్యవసాయ అభివృద్ధి, విద్యుత్ రంగంలో సాధించిన అద్భుతమైన విజయాలతో పాటు పారిశ్రామిక రంగంలో కొత్తగా ప్రకటించిన పాలసీ ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది అంటే జయశంకర్ సార్ ఆలోచనలకు అనుగుణంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న పాలనకు నిదర్శనమని మంత్రి జగదీష్ రెడ్డి కొనియాడారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 − one =