చారిత్రక గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు, ఏర్పాట్లను పరిశీలించిన సీఎస్ సోమేశ్ కుమార్

CS Somesh Kumar Visits Golkonda fort Reviewed Arrangements in Connection with Independence Day Celebrations, CS Somesh Kumar Reviewed Arrangements in Connection with Independence Day Celebrations, Independence Day Celebrations, CS Somesh Kumar Visits Golkonda fort, Golkonda fort, Telangana Chief Secretary Somesh Kumar, Chief Secretary Somesh Kumar, Telangana CS Somesh Kumar, 75th Independence Day, Independence Day Celebrations News, Independence Day Celebrations Latest News And Updates, Independence Day Celebrations Live Updates, Mango News, Mango News Telugu,

ఆగస్టు 15వ తేదీన చారిత్రక గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర ఫ్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్ కుమార్ తెలిపారు. గోల్కొండ కోటలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణ ఏర్పాట్లను వివిధ శాఖల అధికారులతో కలిసి శుక్రవారం సాయంత్రం సీఎస్ పరిశీలించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆగస్టు 15, సోమవారం ఉదయం 10.30 గంటలకు జాతీయ పతాకావిష్కరణ గావిస్తారని సీఎస్ తెలిపారు. జాతీయ పతాకానికి గౌరవంగా నేషనల్ సెల్యూట్ ఉంటుందన్నారు. దీనికి ముందుగా సీఎం కేసీఆర్ పోలీస్ గౌరవ వందనం స్వీకరిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా దాదాపు 1000 మంది కళాకారులు స్వాగతం పలకుతారని ఆయన తెలిపారు.

మరోవైపు రాష్ట్రంలో జరుగుతున్న స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా ఈ నెల 16వ తేదీన ఉదయం 11.30 గంటలకు నిర్వహించే సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమంలో, సమాజంలోని ప్రతి ఒక్కరు పాల్గొనాల్సిందిగా సీఎస్ విజ్ఞప్తి చేశారు. ఈ సమయంలో ప్రతి రహదారిలో ట్రాఫిక్ నిలిపివేయడం జరుగుతుందని అన్నారు. ప్రతీ కార్యాలయం, ప్రముఖ చారిత్రక ప్రదేశాలు, అన్నింటిలో సామూహిక జాతీయ గీతాలాపనకు ఏర్పాట్లు చేశామని సీఎస్ పేర్కొన్నారు. స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్ల పరిశీలనలో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, అడిషనల్ డీజీ జితేందర్, ఇంటలిజెన్స్ అడిషల్ డీజీ అనిల్ కుమార్, జీఏడీ కార్యదర్శి శేషాద్రి, రోడ్లు భవనాల శాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు, జీహెచ్ఎంసీ కమీషనర్ లోకేష్ కుమార్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్, విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన, టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్, సమాచార శాఖ డైరెక్టర్ రాజమౌళి, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ హరికృష్ణ, టీఎస్టీడీసీ ఎండీ మనోహర్ తదితరులు పాల్గొన్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine − 8 =