టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం.. నిందితుల రిమాండ్‌కు ఏసీబీ కోర్టు నిరాకరణ, విడుదలకు ఆదేశం

ACB Court Rejects For Remand of Three Accused Due to Lack of Evidence in TRS MLAs Purchase Case, ACB Court Rejects Three Accused Remand ,Accused Released Lack of Evidence, TRS MLAs Purchase Case, Mango News, Mango News Telugu, 4 TRS MLAs Poaching Incident, TRS MLA Balaraju, TRS MLA Rega Kantarao, TRS MLA Harshavardhan Reddy, Munugode Bypoll, CM KCR News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP , Munugode By Polls, Munugode Election Schedule Release, Munugode Election, Munugode Election Latest News And Updates

తెలంగాణలో బయటపడిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో అనూహ్య మలుపులు చోటుచేసుకుంటున్నాయి. టీఆర్‌ఎస్‌కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరేందుకు ప్రలోభపెట్టి లంచం ఇవ్వజూపినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురిని మొయినాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆ నలుగురు ఎమ్మెల్యేలలో ఒకరైన తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు సతీష్ శర్మ అలియాస్ రామచంద్ర భారతి, హైదరాబాద్ వ్యాపారవేత్త నందకుమార్ మరియు తిరుపతికి చెందిన సింహజాయి స్వామిలపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ క్రమంలో పోలీసులు గురువారం అర్థరాత్రి వరకు దర్యాప్తు చేసినట్లుగా తెలుస్తోంది.

అనంతరం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చి రిమాండ్‌ విధించాలని కోరారు. అయితే రిమాండ్‌కు ఇవ్వాలన్న పోలీసుల విజ్ఞప్తిని న్యాయమూర్తి తిరస్కరించారు. లంచం ఇవ్వజూపిన సొమ్ము దొరకనందున ఈ కేసులో అవినీతి నిరోధక చట్టం (పీసీ యాక్ట్) వర్తించదని కోర్ట్ స్పష్టం చేసింది. ఈ కేసులో సరైన అధరాలు చూపించలేదంటూ రిమాండ్‌కు నిరాకరించిన న్యాయమూర్తి వారిని తక్షణమే విడుదల చేయాలని ఆదేశించారు. అలాగే నిందితులకు ముందు 41 సీఆర్‌పీసీ కింద నోటీసులు ఇవ్వాలని, ఆ తర్వాతే విచారించాలని కోర్టు న్యాయమూర్తి సూచించారు. ఇక న్యాయమూర్తి ఆదేశాల నేపథ్యంలో ఆ ముగ్గురిని విడిచిపెట్టామని శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × three =