ట్విట్టర్ యజమానిగా ఎలోన్ మస్క్, సీఈవో పరాగ్‌ అగర్వాల్‌, సీఎఫ్‌వో నెడ్‌ సెగల్‌ తొలగింపు

Elon Musk Takes Control of Twitter Terminates Top Executives Including CEO Parag Agrawal CFO Ned Segal, Elon Musk Takes Control of Twitter, Terminates Top Executives, CEO Parag Agrawal, CFO Ned Segal, Mango News, Mango News Telugu, Twitter Ex CEO Parag Agrawal, Twitter Ex CFO Ned Segal, Elon Musk Buys Twitter, Elon Musk Twitter Takeover, Elon Musk Latest News And Updates, Elon Musk Twitter Live Updates, Elon Musk Tesla, Elon Musk News And Updates

సోషల్ మీడియా దిగ్గజ కంపెనీ ట్విట్టర్ కు ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈవో, స్పేస్ ఎక్స్ అధినేత ఎలోన్ మస్క్ కొత్త యజమాని అయ్యాడు. గత ఏప్రిల్ లోనే ట్విట్టర్‌ను 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేస్తూ ఎలోన్ మస్క్ ఒప్పందాన్ని కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు పరిణామాల అనంతరం ట్విట్టర్​ను కొనుగోలు డీల్ పూర్తి చేసిన ఎలోన్ మస్క్, అక్టోబర్ 26న ట్విట్టర్ ను హస్తగతం చేసుకుని కొత్త బాస్ గా మారాడు. సింక్‌తో ట్విట్టర్ ప్రధాన కార్యాలయంలోకి ప్రవేశిస్తున్న వీడియోను ఎలోన్ మస్క్ షేర్ చేశాడు. ఇకపై ట్విట్టర్‌ పూర్తి స్థాయిలో ఎలోన్ మస్క్ ఆధ్వర్యంలో నడవనుంది.

కాగా ట్విట్టర్ కు అధిపతిగా మారిన వెంటనే ఎలోన్ మస్క్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ట్విట్టర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ (సీఈవో) పరాగ్ అగర్వాల్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్‌వో) నెడ్ సెగల్ మరియు లీగల్ అఫైర్స్ అండ్ పాలసీ చీఫ్ విజయ గద్దెలను తొలగిస్తూ ఎలోన్ మస్క్ నిర్ణయం తీసుకున్నారు. ట్విట్టర్ లో నకిలీ ఖాతాల సంఖ్యపై ట్విట్టర్ పెట్టుబడిదారులను, తనను వారు తప్పుదారి పట్టించారని ఆరోపిస్తూ ఎలోన్ మస్క్ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా అక్కడి మీడియాలో పేర్కొన్నారు. అలాగే ట్విట్టర్ కొనుగోలు పూర్తయిన అనంతరం ఎలోన్ మస్క్ ట్వీట్ చేస్తూ “పక్షి విముక్తి పొందింది” అని పేర్కొన్నారు. అలాగే ట్విట్టర్‌ను ఎందుకు కొనుగోలు చేశాడో తెలియజేస్తూ ఎలోన్ మస్క్ ట్విట్టర్‌ వేదికగా అడ్వార్టైజర్స్ కు పెద్ద నోట్ రాశాడు. తాను డబ్బు కోసం అలా చేయలేదని, మానవాళికి సాయం చేసేందుకు ప్రయత్నిస్తానని నోట్ లో ఎలోన్ మస్క్ పేర్కొన్నాడు. ముందుగా ట్విట్టర్​ను కొనుగోలు చేయడానికి కోర్టు ఇచ్చిన గడువు అక్టోబర్ 28 కాగా, ఒకరోజు ముందుగానే అన్ని వ్యవహారాలను పూర్తి చేసిన ఎలోన్ మస్క్, ట్విట్టర్ ను హస్తగతం చేసుకుని, కీలక స్థానాల్లో ఉన్నవారిని తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నాడు. మున్ముందు ట్విట్టర్ ద్వారా ఎలోన్ మస్క్ ఎలాంటి సంచలనాలు సృష్టించనున్నాడో వేచి చూడాలి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 4 =