తెలంగాణలో ధాన్యం కొనుగోలుపై రాహుల్ గాంధీ ట్వీట్‌కు, మరో ట్వీట్‌తో కౌంటర్‌ ఇచ్చిన ఎమ్మెల్సీ కవిత

TRS MLC Kavitha Responds Over Rahul Gandhi Tweet on Paddy Procurement in Telangana, MLC Kavitha Responds Over Rahul Gandhi Tweet on Paddy Procurement in Telangana, TRS MLC Kavitha, Rahul Gandhi Tweet on Paddy Procurement in Telangana, Rahul Gandhi Tweet on Paddy Procurement, TRS MP Kavitha, TRS MP Kavitha Responds Over Rahul Gandhi Tweet, Rahul Gandhi Tweet, Paddy Procurement in Telangana, Telangana Paddy Procurement, Paddy Procurement, Telangana Paddy Procurement Latest News, Telangana Paddy Procurement Latest Updates, Telangana, Mango News, Mango News Telugu,

తెలంగాణ‌లో ధాన్యం కొనుగోలుపై రాహుల్ గాంధీ చేసిన‌ ట్వీట్‌కు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత మరో ట్వీట్‌తో కౌంటర్ కౌంట‌ర్ ఇచ్చారు. రాహుల్ గాంధీ గారు, మీరు ఒక ఎంపీగా ఉన్నారు, రాజకీయ లబ్ది కోసం నామమాత్రంగా ట్విట్టర్లో సంఘీభావం తెలుపడం కాదు. ధాన్యం కొనుగోలుపై ఒక్కో రాష్ట్రానికి ఒక్కో విధానం ఉండ‌కూడ‌దని పేర్కొన్నారు. పంజాబ్, హ‌ర్యానాలో ధాన్యం సేక‌రించినట్లే తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా ధాన్యం సేక‌రించాల‌ని కోరుతున్నామ‌ని ఎమ్మెల్సీ క‌విత తెలిపారు. ఈ రెండు రాష్ట్రాల‌కు ఒక నీతి, ఇత‌ర రాష్ట్రాల‌కు ఒక నీతి ఉండ‌కూడ‌ద‌ని టీఆర్ఎస్ ఎంపీలు ప్రతిరోజూ పార్ల‌మెంట్‌లో నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్నార‌ని గుర్తు చేశారు. మీకు నిజాయితీ ఉంటే తెలంగాణ ఎంపీలకు మద్దతుగా వెల్ లోకి వచ్చి నిరసన తెలియజేయాల‌ని రాహుల్‌కు చెప్పారు. ఒకే దేశం – ఒకే సేక‌ర‌ణ విధానం కోసం డిమాండ్ చేయాల‌ని రాహుల్‌ను కోరారు.

ఈ ఉదయం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ధాన్యం కొనుగోళ్ళ విషయంలో తెలంగాణలోని ఒక రైతుని ఉద్దేశించి తెలుగులో ఒక ట్వీట్ పెట్టారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వాలు నైతిక బాధ్యతను విస్మరించి రైతులను అన్యాయం చేస్తున్నారని, దీని వలన తెలంగాణ రైతాంగానికి తీరని అన్యాయం జరుగుతోందని ట్వీట్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో పండిన ప్రతి ధాన్యం గింజను కొనాల్సిందే అని ఆ రెండు ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. గడచిన కొన్ని నెలలుగా తెలంగాణలో ధాన్యం కొనుగోళ్ళ విషయంలో రాష్ట్రానికి, కేంద్రానికి మధ్య ఎడతెగని వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అటు రాహుల్ గాంధీ, ఇటు ఎమ్మెల్సీ క‌విత వరుస ట్వీట్లతో విషయాన్ని మరింత హీటెక్కించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − 16 =