35 కీలక సమావేశాలు, 7,500 కోట్ల భారీ పెట్టుబడులతో అమెరికా పర్యటన విజయవంతం – మంత్రి కేటీఆర్‌

Minister KTR Winds up USA Tour A Grand Success with 35 Business Meetings and Rs 7500 Cr Investments, Minister KTR Winds up USA Tour, USA Tour, Minister KTR Winds up with 35 Business Meetings and Rs 7500 Cr Investments, 35 Business Meetings, 7500 Cr Investments For Telangana, Minister KTR USA Tour, Minister KTR America Tour, KTR America Tour, Telangana Minister KTR On 10 Day Trip To USA, Telangana Minister KTR Will Seek Investment For Telangana, Telangana Minister, Minister KTR 10 Days Tour, America Tour, KTR 10 Days Tour, Telangana Minister KTR, KTR, Minister KTR, KT Rama Rao, Minister of Municipal Administration and Urban Development of Telangana, KT Rama Rao Minister of Municipal Administration and Urban Development of Telangana, KT Rama Rao Information Technology Minister, Mango News, Mango News Telugu,

35 కీలక సమావేశాలు, 7,500 కోట్ల భారీ పెట్టుబడులతో అమెరికా పర్యటన విజయవంతం అయిందని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ వెల్లడించారు. పర్యటన విజయవంతంపై కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేస్తూ.. సహకరించిన తెలంగాణ ఎన్నారైలకు కృతజ్ఞతలు తెలిపారు. మన ఊరు-మన బడిలో భాగస్వాములు కావాలని మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు ప్రవాస భారతీయులను వారి మూలలను గుర్తుచేసింది. దీనిలో తమవంతు చేయూతనిచ్చేందుకు పలువురు ముందుకొచ్చారు. ఈ ఈ పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్‌ పలు ప్రఖ్యాత ఫార్మా, ఐటీ కంపెనీల అధినేతలతో, సీఈఓలతో సమావేశమై తెలంగాణలో పెట్టుబడులకు వారిని ఆహ్వానించారు. రాష్ట్రం తరపున వారికి ఇవ్వబోయే ప్రోత్సాహకాలు గురించి వివరించి చెప్పారు. తద్వారా ప్రపంచ అగ్రశ్రేణి కంపెనీలను రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా ఒప్పించారు.

అలాగే క్వాల్కమ్‌, అడ్వెంట్‌ ఇంటర్నేషనల్ వంటి టాప్ కంపెనీలు తమ శాఖలను విస్తరించేందుకు తెలంగాణలో పెట్టేందుకు అంగీకరించాయి. సాఫ్ట్‌వేర్‌, వైర్‌లెస్‌ టెక్నాలజీ, ప్రాసెసర్ల తయారీలో ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిన క్వాల్కమ్‌ సంస్థ రూ.3900 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. అడ్వెంట్‌ ఇంటర్నేషనల్‌ కంపెనీ తెలంగాణ ఫార్మారంగంలో రూ.1750 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. షిప్‌ ఇన్‌ సంస్థ రూ.వెయ్యి కోట్లతో, ఫార్మా కొపియా, క్యూరియా గ్లోబల్‌ సంస్థలు, ప్రముఖ ఐటీ సంస్థ స్ప్రింక్లర్‌ వంటి పలు కంపెనీలు మరో వెయ్యి కోట్ల వరకు పెట్టుబడులతో రాష్ట్రానికి రానున్నాయి. వీటన్నింటి విలువ రూ.7500 కోట్ల మేరకు ఉంటుందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve − six =