జూలై 14, 15 తేదీల్లో జరగాల్సిన టీఎస్ ఎంసెట్ అగ్రిక‌ల్చ‌ర్ ప‌రీక్ష వాయిదా, ఇంజినీరింగ్‌ యథాతథం

TS EAMCET-2022 Agriculture Exam Scheduled on July 14 15 is Postponed In View of Incessant Rains in State, TS EAMCET 2022 Agriculture Exam Postponed due to heavy rains, TS EAMCET-2022 Agriculture Exam Scheduled on July 14 15 is Postponed, TS EAMCET 2022 Agriculture Exam Postponed, TS EAMCET 2022 Postponed, Agriculture Exam Postponed, heavy rains In Telangana, Telangana EAMCET 2022 Postponed, EAMCET 2022 Postponed, TS EAMCET 2022 postponed for agriculture and medical Exams, Telangana EAMCET 2022 postponed for agriculture and medical Exams, agriculture and medical Exams, TS EAMCET, TS EAMCET 2022 Postponed News, TS EAMCET 2022 Postponed Latest News, TS EAMCET 2022 Postponed Latest Updates, TS EAMCET 2022 Postponed Live Updates, Mango News, Mango News Telugu,

రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల దృష్ట్యా జూలై 14 మరియు 15 తేదీల్లో జరగాల్సిన టీఎస్ ఎంసెట్ (ఏఎం)-2022 (అగ్రికల్చర్ స్ట్రీమ్) పరీక్షను వాయిదా వేస్తున్నట్టు తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్‌ లింబాద్రి ప్రకటించారు. ఎంసెట్ అగ్రిక‌ల్చ‌ర్ ప‌రీక్ష కోసం రీషెడ్యూల్ చేసిన తేదీలు తర్వాత తెలియజేయబడతాయన్నారు. అయితే ఇంజనీరింగ్ స్ట్రీమ్ కోసం టీఎస్ ఎంసెట్-2022 పరీక్ష జూలై 18, 19, 20 తేదీల్లో యధాతథంగా నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ తేదీల షెడ్యూల్ లో ఎలాంటి మార్పు ఉండదని పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం చైర్మన్ ప్రొఫెసర్‌ లింబాద్రి ఒక ప్రకటన విడుదల చేశారు.

రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటుగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసిందని, ఈ ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించి జూలై 14, 15 తేదీల్లో జరగాల్సిన టీఎస్ ఎంసెట్ అగ్రిక‌ల్చ‌ర్ ప‌రీక్షను మాత్రమే వాయిదా వేయాలని నిర్ణయించడం జరిగిందని తెలిపారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాల దృష్ట్యా జూలై 13, బుధవారం జరగాల్సిన ఈసెట్‌-2022 ప్రవేశ పరీక్షను కూడా వాయిదా వేస్తూ తెలంగాణ ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − 5 =