గురుపూర్ణిమ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ, పలువురు ప్రముఖులు

PM Modi Vice President Venkaiah Naidu CM Jagan Greets People on the Auspicious Occasion of Guru Purnima, CM Jagan Greets People on the Auspicious Occasion of Guru Purnima, PM Modi Greets People on the Auspicious Occasion of Guru Purnima, Vice President Venkaiah Naidu Greets People on the Auspicious Occasion of Guru Purnima, Auspicious Occasion of Guru Purnima, Vyasa Purnima, Guru Purnima, Guru Purnima Wishes, Guru Purnima Greetings, Vice President Venkaiah Naidu, PM Modi, CM Jagan, occasion of Onam, The festival is dedicated to spiritual and academic teachers, Mango News, Mango News Telugu,

గురు పూర్ణిమ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. “గురు పూర్ణిమ శుభాకాంక్షలు. మనకు స్ఫూర్తినిచ్చి, మనకు మార్గదర్శకత్వం వహించి, జీవితం గురించి ఎంతో నేర్పించిన ఆదర్శప్రాయమైన గురువులందరికీ ఇది కృతజ్ఞతలు తెలుపుకునే రోజు. మన సమాజం నేర్చుకోవడానికి మరియు జ్ఞానానికి ఎనలేని ప్రాముఖ్యతనిస్తుంది. మన గురువుల ఆశీస్సులు భారతదేశాన్ని మరింత ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లాలి” అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

గురు పౌర్ణమి శుభాకాంక్షలు. అజ్ఞాన చీకట్లు తొలగించి, విజ్ఞాన జ్యోతులను వెలిగించి, సమాజంలో అభివృద్ధికి మార్గదర్శనం చేస్తున్న గురువులందరికీ గురుపౌర్ణమి సందర్భంగా ప్రణామాలు తెలియజేస్తున్నాను. విద్య అంటే మార్కులకు అవసరమైన అక్షరాలు కాదు, మనుగడకు అవసరమైన సంస్కారం. ఈ స్ఫూర్తితో శిష్యులకు మార్గదర్శనం చేస్తూ వారిని నవసమాజ నిర్మాణంలో భాగస్వాములుగా గురువులు తీర్చిదిద్దాలని, శిష్యులు సైతం గురువు గొప్పతనాన్ని లోకానికి తెలియజేసే రీతిలో ప్రవర్తించాలని ఆకాంక్షిస్తున్నాను – ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

రాష్ట్ర ప్రజలందరికీ గురుపూర్ణిమ శుభాకాంక్షలు. విజ్ఞాన, వికాసాలను అందించే పూజ్య గురువులందరికీ ఆ గురుపరంపరకు హృదయపూర్వక నమస్కారాలు – ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

భారతీయ సంస్కృతిలో తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువులకే దక్కింది. మనం నిర్దేశించుకున్న గమ్యానికి చేరేందుకు అవసరమైన నైపుణ్యం, శిక్షణ అందించే గురువు దైవంతో సమానం. అటువంటి గురుదేవులందరికీ నా పాదాభివందనాలు. ప్రజలందరికీ గురుపూర్ణిమ శుభాకాంక్షలు – టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − seven =