తెలంగాణలో ఎడ్‌సెట్‌-2021, లాసెట్‌-2021, పీజీ లాసెట్‌-2021 అడ్మిషన్స్ కౌన్సెలింగ్‌ షెడ్యూల్ ఇదే…

Mango News, TS EDCET Counselling Process, TS EDCET Counselling Process 2021, TS EdCET First Phase Counselling, TS EdCET First Phase Counselling Schedule, TS EdCET First Phase Counselling Schedule 2021, TS EdCET-2021, TS EdCET-2021 TS LAWCET-2021 First Phase Counselling Schedule Released, TS LAWCET, TS LAWCET First Phase Counselling, TS LAWCET First Phase Counselling 2021, TS LAWCET Web Counselling Schedule 2022, TS LAWCET-2021, TS LAWCET-2021 First Phase Counselling, TS LAWCET-2021 First Phase Counselling Schedule, TS LAWCET-2021 First Phase Counselling Schedule Released

రాష్ట్రంలో రెండేండ్ల బీఈడీ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్‌ ఎడ్‌సెట్‌-2021 మొదటివిడత కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ ను బుధవారం విడుదల చేశారు. తెలంగాణలోని విశ్వవిద్యాలయాలు మరియు అనుబంధ కళాశాలల్లో బీఈడీ కోర్సులో ప్రవేశాల కోసం డిసెంబర్ 1 నుండి మొదటి విడత కౌన్సెలింగ్ పక్రియ ప్రారంభమవుతుందని టీఎస్ ఎడ్ సెట్-2021 కన్వీనర్ పేర్కొన్నారు.

అలాగే తెలంగాణలో వివిధ విశ్వవిద్యాలయాల్లో అందిస్తున్న ఎల్ఎల్బీ (3 సంవత్సరాల కోర్సు)/ఎల్ఎల్బీ 5 సంవత్సరాల (ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్సులు) మరియు 2 సంవత్సరాల ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన టీఎస్‌ లాసెట్‌-2021, టీఎస్ పీజీ లాసెట్‌-2021 మొదటివిడత కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ ను కూడా బుధవారం విడుదల చేశారు. నవంబర్ 27 నుంచి కౌన్సెలింగ్ పక్రియ ప్రారంభం కానున్నట్టు టీఎస్ లాసెట్-2021 కన్వీనర్ తెలిపారు.

టీఎస్‌ ఎడ్‌సెట్‌-2021 అడ్మిషన్స్ కౌన్సెలింగ్‌ షెడ్యూల్:

మొదటి విడత:

  • నోటిఫికేషన్ జారీ : నవంబర్ 29
  • ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ మరియు వెరిఫికేషన్, ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు, ధృవీకరణ కోసం స్కాన్ చేసిన సర్టిఫికెట్ల కాపీలను అప్‌లోడ్ చేయడం: డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 8 వరకు
  • స్లాట్ బుకింగ్ ద్వారా ఎన్సీసీ/క్యాప్/దివ్యాంగ/స్పోర్ట్స్ కోటా విద్యార్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ : డిసెంబర్ 9 నుంచి డిసెంబర్ 14 వరకు
  • నమోదిత అభ్యర్థుల జాబితా ప్రదర్శన : డిసెంబర్ 17
  • వెబ్‌ ఆప్షన్స్ పక్రియ – మొదటివిడత : డిసెంబర్ 18 నుంచి డిసెంబర్ 20 వరకు
  • వెబ్‌ ఆప్షన్స్ సవరణ – మొదటివిడత : డిసెంబర్ 21
  • ఎంపికైన అభ్యర్థుల జాబితా కళాశాలల వారీగా సిద్ధం చేసి వెబ్ సైట్ లో ఉంచడం (మొదటి విడత సీట్లు కేటాయింపు): డిసెంబర్ 24
  • సంబంధిత కళాశాలల్లో రిపోర్టు చేయడంతో పాటు ఒరిజినల్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్, ట్యూషన్ ఫీజు చలాన్ చెల్లింపు: డిసెంబర్ 24 నుంచి డిసెంబర్ 28 వరకు
  • తరగతులు ప్రారంభం : డిసెంబర్ 30

టీఎస్‌ లాసెట్‌-2021/టీఎస్ పీజీ లాసెట్‌-2021 అడ్మిషన్స్ కౌన్సెలింగ్‌ షెడ్యూల్:

మొదటి విడత:

  • నోటిఫికేషన్ జారీ : నవంబర్ 26
  • ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ మరియు వెరిఫికేషన్, ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు, ధృవీకరణ కోసం స్కాన్ చేసిన సర్టిఫికెట్ల కాపీలను అప్‌లోడ్ చేయడం: నవంబర్ 27 నుంచి డిసెంబర్ 6 వరకు
  • స్లాట్ బుకింగ్ ద్వారా ఎన్సీసీ/క్యాప్/దివ్యాంగ/స్పోర్ట్స్ కోటా విద్యార్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ : డిసెంబర్ 6 నుంచి డిసెంబర్ 10 వరకు
  • నమోదిత అభ్యర్థుల జాబితా ప్రదర్శన : డిసెంబర్ 10
  • వెబ్‌ ఆప్షన్స్ పక్రియ – మొదటివిడత : డిసెంబర్ 11 నుంచి డిసెంబర్ 13 వరకు
  • వెబ్‌ ఆప్షన్స్ సవరణ – మొదటివిడత : డిసెంబర్ 14
  • ఎంపికైన అభ్యర్థుల జాబితా కళాశాలల వారీగా సిద్ధం చేసి వెబ్ సైట్ లో ఉంచడం (మొదటి విడత సీట్లు కేటాయింపు): డిసెంబర్ 17
  • సంబంధిత కళాశాలల్లో రిపోర్టు చేయడంతో పాటు ఒరిజినల్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్, ట్యూషన్ ఫీజు చలాన్ చెల్లింపు: డిసెంబర్ 18 నుంచి డిసెంబర్ 23 వరకు
  • తరగతులు ప్రారంభం : డిసెంబర్ 27
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × one =