టీఎస్ పాలిసెట్‌ ఫలితాలు విడుదల, పాలిసెట్ ప్రవేశాల షెడ్యూల్ ఇదే…

Telangana Polycet 2020 Results Relased, Telangana Polycet Results, Telangana Polycet Results 2020, Telangana Polycet-2020 Results, Telangana Polycet-2020 Results Released, Telangana Polycet-2020 Results Released Today, TS POLYCET, TS POLYCET results, TS POLYCET results 2020

తెలంగాణ రాష్ట్రంలో పాలిటెక్నిక్‌ ప్రవేశ పరీక్ష(పాలిసెట్) ఫలితాలు సెప్టెంబర్ 10, గురువారం నాడు విడుదల అయ్యాయి. రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌ మిట్టల్ ‌నాంపల్లిలోని తన కార్యాలయంలో పాలిసెట్ ర్యాంకులను విడుదల చేశారు. పాలిసెట్ పరీక్షకు హాజరైన విద్యార్థులంతా అధికారిక వెబ్‌సైట్‌ www.polycetts.nic.in లో ఫలితాలను చూసుకోవాలని అధికారులు సూచించారు. సెప్టెంబర్ 2వ తేదీన జరిగిన ప్రవేశ పరీక్షకు మొత్తం 56,814 మంది విద్యార్థులు హాజరయ్యారు. మరోవైపు టీఎస్‌ పాలిసెట్‌ ప్రవేశ పక్రియ షెడ్యూల్ ను కూడా ఇప్పటికే విడుదల చేశారు.

టీఎస్‌ పాలిసెట్‌ ప్రవేశాల షెడ్యూల్:

  • సెప్టెంబర్ 12 నుంచి‌ మొదటి విడత ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం
  • సెప్టెంబర్ 12 నుంచి 17 వరకు ధ్రువీకరణపత్రాలు, సర్టిఫికెట్ల పరిశీలనకు స్లాట్‌ బుకింగ్
  • సెప్టెంబర్ 14 నుంచి 18 వరకు సర్టిఫికెట్ల పరిశీలన
  • సెప్టెంబర్ 14 నుంచి 20 వరకు వెబ్‌ ఆప్షన్స్
  • సెప్టెంబర్ 22 న మొదటి విడత సీట్లు కేటాయింపు
  • సెప్టెంబర్ 22 నుంచి 26 వరకు ఫీజు చెల్లించి, సెల్ఫ్ రిపోర్టింగ్
  • సెప్టెంబర్ 30 నుంచి తుది విడత ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం
  • సెప్టెంబర్ 30, అక్టోబర్ 1 న వెబ్‌ ఆప్షన్స్
  • అక్టోబర్ 3 న తుది విడత సీట్లు కేటాయింపు
  • అక్టోబర్ 7 నుంచి విద్యా సంవత్సరం ప్రారంభం.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve − twelve =