స్వప్నలోక్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాద ఘటన: మృతుల కుటుంబాల‌కు పీఎం మోదీ రూ.2 ల‌క్ష‌ల ఎక్స్‌గ్రేషియా ప్రకటన

PM Modi Announces Rs 2 Lakhs Ex-gratia from PMNRF for the Victims of Secunderabad Swapnalok Complex Incident,PM Modi Announces Rs 2 Lakhs Ex-gratia from PMNRF,PM Modi For the Victims of Secunderabad,PM Modi on Swapnalok Complex Incident,Mango News,Mango News Telugu,PM Modi announces Rs 2L exgratia,PM announces ex-gratia from PMNRF,Swapnalok Complex Accident,PM Modi,Indian Prime Minister Narendra Modi,Narendra modi Latest News and Updates,Telangana Latest News

సికింద్రాబాద్ లోని స్వప్నలోక్ కాంప్లెక్స్ లో చోటుచేసుకున్న ఘోర అగ్నిప్రమాద ఘటనలో నలుగురు యువతులు, ఇద్దరు యువకులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాద ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అగ్ని ప్రమాదం కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారికీ సంతాపం తెలిపారు. “సికింద్రాబాద్‌లోని స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోయినందుకు బాధగా ఉంది. నా ఆలోచనలు మృతుల కుటుంబాలతో ఉన్నాయి. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను” అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. అలాగే స్వప్నలోక్ కాంప్లెక్స్ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పిఎంఎన్‌ఆర్‌ఎఫ్) నుండి రూ.2 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి రూ.50 వేలు పరిహారం అందించనున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here