తెలంగాణ రాష్ట్రంలో మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల… వివరాలివే…

TSPSC Releases Notification for 23 Posts of Women and Child Welfare Officer, TSPSC Notifies 23 Vacancies Of Women and Child Welfare Officer, Women Development and Child Welfare Department, Extension Officer Grade1, TSPSC Recruitment 2022 Notification , Mango News, Mango News Telugu, TSPSC Extension Officer Recruitment 2022, TSPSC Extension Officer Jobs 2022, TSPSC Extension Officer Notification, TSPSC Recruitment Latest News And Updates, TSPSC 2022 News And Live Updates, WDCW Department , Telangana Government

తెలంగాణ రాష్ట్రంలో మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల అయింది. రాష్ట్రంలోని మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖలో 23 మహిళా, శిశు సంక్షేమ అధికారి పోస్టుల భ‌ర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) సోమవారం నోటిఫికేష‌న్‌ ను విడుద‌ల చేసింది. కాగా ఈ మహిళా, శిశు సంక్షేమ అధికారి పోస్టులు ఐసీడీఎస్ శిశు అభివృద్ధి ప్రాజెక్ట్ అధికారి, ఐసీడీఎస్ అడిషనల్ శిశు అభివృద్ధి ప్రాజెక్ట్ అధికారి మరియు వేర్‌హౌస్ మేనేజర్‌ పోస్టులతో కలిపే అని పేర్కొన్నారు. మల్టీ జోన్-1లో 17, మల్టీ జోన్-2లో 6 కలిపి మొత్తం 23 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కాగా, ఈ పోస్టులకు స్కేల్ ఆఫ్ పే రూ.51,320–రూ.1,27,310 ఉంటుందని పేర్కొన్నారు.

ఇక టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్ (https://www.tspsc.gov.in)లో అందుబాటులో ఉంచిన ప్రొఫార్మా అప్లికేషన్ ద్వారా అర్హత కలిగిన మహిళా అభ్య‌ర్థుల నుంచి ఆన్‌లైన్‌లో సెప్టెంబర్ 13వ తేదీ నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నట్టు తెలిపారు. ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ అక్టోబర్ 10 (సాయంత్రం 5 గంటల వరకు) అని, అలాగే ఫీజు చెల్లింపు సమర్పణకు కూడా అక్టోబర్ 10 సాయంత్రం 5 గంటల వరకు అవకాశం ఇస్తున్నట్టు వెల్లడించారు. ఇక పరీక్షకు 7 రోజుల ముందు నుండి హాల్ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చుని నోటిఫికేషన్ లో తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × five =