తెలంగాణలో రైతాంగాన్ని ప్రత్యామ్నాయ పంటల దిశగా ప్రోత్సహిస్తున్నాం – మంత్రి కేటీఆర్‌

Minister KTR Participates in IVPA India’s Global Roundtable on Veg Oil and Oilseed Sector in Hyderabad Today,Telangana Farmers,Telangana Farmers Alternative Crops, Telangana Minister KTR,Mango News,Mango News Telugu,KTR,KTR Latest News And Updates,Minister KTR,Minister KTR News And Updates,Telangana Farmers Crops,Telangana Agriculture,CM KCR News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP , Telangana BRS Party, Telagana CM KCR, Telangana CM Latest News And Updates

తెలంగాణలో ధాన్యం ఉత్పత్తి పెరిగిందని, అయితే రాష్ట్రంలో పండే ధాన్యాన్ని కొనుగోలు చేయలేమని కేంద్రం చేతులెత్తేసిందని పేర్కొన్నారు మంత్రి కేటీ రామారావు. శుక్రవారం ఆయన హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ‘వెజ్ ఆయిల్ మరియు ఆయిల్‌సీడ్ సెక్టార్‌’పై గిరిజన ఐవీపీఏ ఇండియా గ్లోబల్ రౌండ్‌టేబుల్‌లో మరో మంత్రి నిరంజన్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ రైతాంగాన్ని ప్రత్యామ్నాయ పంటల దిశగా ప్రోత్సహిస్తున్నామని, దీనిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని తెలిపారు. అలాగే రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుపై కూడా దృష్టి సారించామని, చమురు ఉత్పత్తిలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి ఉన్నవారు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

అలాగే ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన దిగ్గజ కంపెనీలన్నీ తమ వ్యాపార గమ్యస్థానంగా హైదరాబాద్ లో తమ కార్యాలయాలను ఏర్పాటు చేసుకున్నాయని, ఇదే బాటలో ఎన్నో యునికార్న్ కంపెనీలు తమ ప్రధాన కార్యాలయాలను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాయని తెలిపారు. కరోనా మహమ్మారిని అరికట్టేందుకు చేసిన ప్రయత్నాలలో ప్రపంచానికే హైదరాబాద్ వ్యాక్సిన్ రాజధానిగా మారిందని, అలాగే లైఫ్ సైన్సెస్ రంగంలో నగరం పురోగమిస్తోందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ‘టీఎస్ ఐపాస్’ ద్వారా తెలంగాణలో పరిశ్రమల స్థాపనకు అనుమతులు సులభతరం చేశామని, దేశంలో ఎక్కడా లేనివిధంగా కేవలం 15 రోజుల్లోనే పరిశ్రమలకు కావాల్సిన అన్ని అనుమతులు అందిస్తున్నామని వెల్లడించారు. ఈ క్రమంలో ‘అమెజాన్’ క్యాంపస్ ఏర్పాటుకు 11 రోజుల్లోనే అన్ని రకాల అనుమతులు ఇచ్చామని గుర్తు చేశారు. ఇంకా తెలంగాణలో పర్యావరణానికి ప్రాధాన్యతనిస్తున్నామని, గత ఎనిమిదేళ్లలో పచ్చదనం 24 శాతం పెరిగిందని తెలిపారు.

ఇక మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ వ్యవసాయ విధానాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని, రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగును పెద్దఎత్తున ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. సీఎం కేసీఆర్ హయాంలో సాగునీటికి ప్రాధాన్యతనిచ్చి అనేక ప్రాజెక్టులు నిర్మించడంతో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం భారీగా పెరిగిందని, రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా పచ్చని పంట పొలాలే కనిపిస్తున్నాయని చెప్పారు. భారతదేశంలో చమురు పంటల సాగుకు అవసరమైన అన్ని సహజ వనరులు మన రాష్ట్రంలో ఉన్నాయని, దీనిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం ఆయిల్‌పామ్‌ సాగుకు రైతులను ప్రోత్సహిస్తోందని, రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ సాగు లక్ష్యంగా పెట్టుకున్నామని తెలియజేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve − one =