కేంద్ర బడ్జెట్ నిరాశ పరిచింది.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

2022 Parliament Budget session, 2022 Union Budget, Budget session of Parliament, Budget Session of the Parliament 2022, Finance Minister Nirmala Sitharaman, Finance Minister Nirmala Sitharaman Completely Disappoints, Mango News, Mango News Telugu, Parliament Budget Session, Parliament Budget Session 2022, Parliament Budget Session Updates, TPCC Chief Revanth Reddy, TPCC Chief Revanth Reddy Says Finance Minister Nirmala Sitharaman Completely Disappoints, Union Budget, Union Budget 2022-23, Union Budget 2022-23 Updates

నిన్న పార్లమెంట్లో కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తి నిరాశపరిచిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. రైతులకు కానీ, మహిళలకు కానీ, యువకులకు ఉద్యోగ కల్పన చేయటంలో కానీ, కూలీలకు ఉపాధి అవకాశాలు కల్పించటంలో కానీ.. ఇలా ఏ ఒక్కరికి ఈ బడ్జెట్లో న్యాయం చేయలేదని రేవంత్ రెడ్డి విమర్శించారు. దేశంలోని జనాభాలో 70% ఉన్న రైతులకు ఈ బడ్జెట్లో రిక్తహస్తం చూపించారని రేవంత్ అన్నారు. ఒకపక్క రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. రైతులు కష్టపడి పండించిన పంటకు చట్టబద్ధత కల్పించలేదని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎరువుల పైన సబ్సిడీ తగ్గించారు. వరి, గోధుమలు కొనుగోలు సేకరణ నిధులు తగ్గించారు. ఉపాధి హామీ పథకానికి సంబంధించి 25,000 కోట్ల రూపాయలు కోత విధించారని రేవంత్ మండిపడ్డారు.

రాష్ట్ర పునర్విభజన ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పథకాలు, కేటాయింపులు ఏవీ కేంద్ర ప్రభుత్వం సక్రమంగా ఇవ్వడంలేదని రేవంత్ అన్నారు. మరోవైపు రాష్ట్రానికి రావాల్సిన నిధులు తేవడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని రేవంత్ ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న బడ్జెట్ పైన బాధ్యతారాహిత్యంగా మాట్లాడారని ఆయన విమర్శించారు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులు, విద్యుత్ ఉత్పత్తి నిర్మాణ ప్రాజెక్టులు, బయ్యారం ఉక్కు కర్మాగారం, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ ఇలా ఏ ఒక్కదానికీ నిధులు సాధించలేకపోయిందని.. ఇది పూర్తిగా కేసీఆర్ ప్రభత్వం వైఫల్యం అని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 + 20 =