మేడారం మహా జాతరకు నేడు అంకురార్పణ – ‘గుడిమెలిగె’ పండుగతో ఆరంభం

2022 Medaram Jatara, Gudimelige Festival, Mango News, Medaram, Medaram Jatara, Medaram Jatara 2022, medaram jatara 2022 dates, Medaram Jatara Arrangements, Medaram Jatara Latest News, Medaram Jatara Updates, Medaram Maha Jatara, Medaram Maha Jatara Beginning With The Gudimelige Festival From Today, Medaram Maha Jathara Arrangement, medaram sammakka sarakka jatara, Sammakka Saarakka Jaathara, sammakka sarakka jatara

తెలంగాణ రాష్ట్రంలో జరిగే అతి పెద్ద గిరిజన పండుగ ‘మేడారం సమ్మక్క-సారలమ్మల మహాజాతర’. దేశం నలుమూలలనుంచి భక్తులు హాజరుకానున్న ఈ మేడారం మహాజాతర ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు జరుగనుంది. ఈ మహాజాతర పూజాకార్యక్రమాలు బుధవారం జరగనున్న ‘గుడిమెలిగె’ పండుగతో ఆరంభం కానున్నాయి. ఈ పండుగ నిర్వహించేందుకు పూజారులు మంగళవారం సాయంత్రం నుంచే అన్ని సిద్ధం చేసుకున్నారు. వచ్చే బుధవారం (9న) ‘మండమెలిగె’ పండుగకు వారానికి ముందుగా ‘గుడిమెలిగె’ పండుగ నిర్వహించడం ఆనవాయితీ. పూర్వకాలంలో మేడారంలోని సమ్మక్క గుడి గుడిసెలో ఉండేది. అప్పుడు గుడిసెపై కొత్త గడ్డి కప్పి, పందిళ్లు వేసేవారు.

అయితే, కాలక్రమంలో సమ్మక్క గుడి భవనం నిర్మించడంతో.. పూజారులు సంప్రదాయంగా బుధవారం ఉదయాన్నే సమ్మక్క గుడిని శుద్ధిచేసి ముగ్గులతో అలంకరిస్తారు. అడవినుంచి సేకరించిన ఎట్టిగడ్డిని గుడిపై ఈశాన్య దిశలో పెడతారు. ‘గుడిమెలిగె’ పండుగ సందర్భంగా గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు చేస్తారు. నేటి ‘గుడిమెలిగె’ పండుగతో మహాజాతరకు అంకురార్పణ జరిగినట్లుగా భక్తులు భావిస్తారు.  అలాగే, కన్నెపల్లి సారలమ్మ గుడిలో కూడా ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ మహాజాతరకు  కోటి  మందికి పైగా భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. తెలంగాణ తోపాటు మహారాష్ట్ర, చత్తీస్ గఢ్, ఏపీ, ఒడిశా రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు జాతరకు వస్తుంటారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − one =