ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా, హైదరాబాద్‌లో దివ్యాంగులకు ట్రై సైకిల్స్ పంపిణీ చేసిన అమిత్ షా

Union Minister Amit Shah Distributes Tricycles To Abled in Hyderabad on The Occasion of PM Modi's Birthday, Union Minister Amit Shah Distributes Tricycles , Union Minister Amit Shah , Occasion of PM Modi's Birthday, Ministerial Colleagues Extend Birthday Wishes For PM, Prime Minister Narendra Modi Turns 72, PM Modi 72nd Birthday, Vice-President Jagdeep Dhankhar Greets Modi, Narendra Modi Birthday, Mango News, Mango News Telugu, Happy Birthday Narendra Modi, Wishes Pour in as PM Turns 72, Narendra Modi Birthday Wishes Twitter, Modi Happy Birthday Date, Pm Modi Happy Birthday, PM Modi Latest News And Updates

హైదరాబాద్ పర్యటనలో ఉన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బిజీగా గడుపుతున్నారు. శనివారం ఉదయం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలలో పాల్గొన్న సంగతి తెలిసిందే. అనంతరం అమిత్ షా సికింద్రాబాద్ క్లాసిక్ గార్డెన్స్‌లో ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా నిర్వహించిన పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దీనిలో భాగంగా ఆయన దాదాపు 600 మంది దివ్యాంగులకు ట్రై సైకిల్స్ పంపిణీ చేశారు. ఇక ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా దేశవ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలను చేపడుతున్నామని, దీనిలో భాగంగా నేడు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నామని తెలిపారు. కేంద్రప్రభుత్వం ఆధ్వర్యంలో పేదప్రజలకు, బడుగు బలహీన వర్గాల వారికి ఉపయుక్తంగా ఉండేలా ఉచితంగా గ్యాస్, రేషన్, పెన్షన్ వంటివి అమలుచేస్తున్నామని వివరించారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేదలకు భరోసా దొరికిందని, ప్రధాని మోదీ కూడా నిరంతరం వారి అభ్యున్నతి కోసమే పాటుపడుతున్నారని తెలిపారు. కాగా దీనికి ముందు బీజేపీ కోర్ కమిటీ మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర నేతలకు అమిత్ షా వచ్చే ఎన్నికలలో పార్టీ పరంగా అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four + 20 =