కమలంపార్టీలో ఎంపీ టికెట్లకు ఇప్పటి నుంచే పోటీ

BJPs target is 8 seats,BJPs target,Target is 8 seats,BJP President Nayab Saini,Telangana,BJPs target is 8 seats, Competition for MP tickets,BJP leaders,BJP, BRS, Janasena, Congress,Bharatiya Janata Party,Mango News,Mango News Telugu,Ashok Gehlot again targets BJP,BJPs target Latest News,BJPs target Latest Updates,Competition for MP tickets Latest News,BJP leaders Live Updates
Telangana,BJP's target is 8 seats, Competition for MP tickets, ,BJP leaders,BJP, BRS, Janasena, Congress

లోక్ సభలకు చాలా సమయం ఉన్నా కూడా.. బీజేపీలో ఇప్పటి నుంచే ఎంపీ టికెట్ల ప్రయత్నాలు మొదలయిపోయాయి. ఈ మధ్య జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన నేతలు మరోసారి ఇప్పుడు మళ్లీ తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి  సిద్ధమవుతున్నారు. 2019 లోక్‌సభ ఎలక్షన్స్‌లో  ఏ పార్టీ తోనూ పొత్తు లేకుండానే సొంతంగా పోటీచేసిన భారతీయ జనతా పార్టీ 4 సెగ్మెంట్‌లలో గెలిచింది. 2018 అసెంబ్లీ ఎలక్షన్స్‌లో  మాత్రం.. ఒక ఎమ్మెల్యే సీటును గెలిచి 7% ఓట్లు సాధించిన కమలం పార్టీ.. 2019లో  జరిగిన లోక్‌సభ ఎలక్షన్స్‌లో  18 శాతానికి ఓటింగ్‌ను పెంచుకుంది.

అయితే తాజాగా తెలంగాణలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఎన్నికలలో స్థానాల్లో గెలుపొంది.. 18 శాతానికి ఓటింగ్‌ను పెంచుకుంది. 19 అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థులు సెకండ్ ప్లేసులో నిలవగా, 49 సెగ్మెంట్‌లలో డిపాజిట్లు దక్కించుకున్నారు. అయితే త్వరలో జరగబోయే లోక్‌సభ ఎలక్షన్స్‌లో  25 శాతానికి ఓటింగ్‌ పెంచుకొని 8 సీట్లు సాధించడమే ఇప్పుడు బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది.

సికింద్రాబాద్‌ నుంచి కేంద్రమంతి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, అలాగే కరీంనగర్ స్థానం నుంచి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ , నిజామాబాద్ స్థానం నుంచి అర్వింద్‌ ధర్మపురి సిట్టింగ్ ఎంపీలుగా మళ్లీ ఆయా స్థానాల నుంచి సిద్ధమయ్యారు. అయితే బోథ్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడిపోయిన ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాపూరావుకు..  ఈ సారి లోక్ సభకు పోటీకి మళ్లీ అవకాశం కల్పిస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

అటు తాజాగా జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందే బీఆర్‌ఎస్‌కి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరిన రాథోడ్‌ బాపూరావు.. ఈసారి ఆదిలాబాద్‌ నుంచి లోక్‌సభకు పోటీ చేసే అవకాశాలున్నాయనే వార్త వినిపిస్తోంది.  అయితే మరోవైపు రాథోడ్‌ బాపూరావుతోపాటు ఈసారి ఖానాపూర్‌ నుంచి ఓడిపోయిన మాజీ ఎంపీ రమేశ్‌రాథోడ్‌ కూడా ఈ సీటు ఆశిస్తున్నట్టు తెలుస్తోంది.

ఆదిలాబాద్‌ ఎంపీ సెగ్మెంట్‌ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో ఆదిలాబాద్, నిర్మల్, సిర్పూర్, ముథోల్‌ గెలిచిన జోరు మీదున్న బీజేపీ ఎంపీ సీటును కచ్చితంగా కైవసం చేసుకుంటామనే ధీమాతో ఉంది. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా పరిధిలోని మూడు ఎమ్మెల్యే సెగ్మెంట్‌లలోనూ పార్టీ విజయం సాధించడం, జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు హామీని నిలుపుకున్నందున నిజామాబాద్‌ ఎంపీ స్థానాన్ని మళ్లీ కైవసం చేసుకుంటామనే విశ్వాసం పార్టీ నాయకుల్లో వ్యక్తమవుతోంది.

సిట్టింగ్‌ స్థానాలు తప్ప మిగిలిన 13 ఎంపీ సీట్లలో పోటీకి కొందరు కీలక నేతలు గట్టిగానే తమ ప్రయత్నాలు చేస్తున్నారు. మల్కాజిగిరి స్థానం నుంచి  బీజేపీ నేత, మధ్యప్రదేశ్‌ ఇన్‌చార్జ్‌ పి.మురళీధర్‌రావు..అలాగే  మహబూబ్‌నగర్‌ స్థానం నుంచి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణకు ఇప్పటికే అధిష్టానం నుంచి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే మహబూబ్‌నగర్‌ స్థానం నుంచి పోటీకి మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి, కల్వకుర్తి స్థానం నుంచి అసెంబ్లీకి పోటీ చేసిన టి.ఆచారి కూడా సిద్ధంగా ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

మెదక్‌ స్థానం నుంచి పోటీకి తాను సిద్ధమైనట్టు మాజీ ఎమ్మెల్యే  రఘునందన్‌రావు ఇప్పటికే ప్రకటించారు. అలాగే సీనియర్‌నేత ఈటల రాజేందర్‌  మల్కాజిగిరి, మెదక్, కరీంనగర్‌లలో ఎక్కడో ఒకచోట నుంచి పోటీకి సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే చేవెళ్ల లోక్‌సభ స్థానం నుంచి బరిలో దిగడానికి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఎప్పటి నుంచో సిద్ధంగా ఉన్నారు.  మరోవైపు భువనగిరి సీటు తనకు టికెట్‌ తనకేనన్న నమ్మకంలో  ఎంపీ డాక్టర్ బూరనర్సయ్యగౌడ్‌ ఉన్నారు. అంతేకాదు గోషామహల్‌ ఎమ్మెల్యే టి.రాజాసింగ్‌ జహీరాబాద్‌ నుంచి పోటీకి ఉత్సాహం చూపిస్తున్నారు. ఇలా చాలామంది అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచే కూడా  దానికి సంబంధించిన కార్యాచరణలో నిమగ్నమైనట్టు తెలుస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one + 9 =