విమోచన లేదా విలీనం, ఏ పేరుతో పిలిచినా సెప్టెంబర్ 17 చారిత్రాత్మక శుభ దినం: పవన్ కళ్యాణ్

Janasena Chief Pawan Kalyan Wishes People of Telangana State on Telangana Liberation Day, Janasena Chief Pawan Kalyan Wishes on Telangana Liberation Day, Janasena Chief Pawan Kalyan, Pawan Kalyan Wishes People of Telangana, Telangana National Unity Vajrotsavam, Holiday on Telangana Day, Telangana Jathiya Samaikyatha Vajrotsavalu, Jathiya Samaikyatha Vajrotsavalu, Mango News, Mango News Telugu, CS And DGP Reviews Telangana Day Arrangements, Telangana Day, Telangana Day 2022, Telangana Jathiya Samaikyatha Vajrotsavalu 2022, Telangna CM KCR, Telangna Day Latest News And Live Updates, Telangana

తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. “చైతన్యానికి నెలవు, విప్లవాలకు కొలువు తెలంగాణ. ప్రపంచంలోనే పేరుగాంచిన సాయుధ పోరాటానికి జన్మనిచ్చిన పురిటి గడ్డ తెలంగాణ. అటువంటి ఈ పుణ్యభూమికి సంపూర్ణ స్వేచ్ఛ లభించిన రోజు సెప్టెంబర్ 17. దీనిని విమోచన అనండి లేదా విలీనం అనండి. ఏ పేరుతో పిలిచినా సరే ఈ రోజు మాత్రం చారిత్రాత్మక శుభ దినం. ప్రజలకు బానిస సంకెళ్లు తొలగిన మరపురాని దినం. తెలంగాణ వాసులందరికీ పండుగ దినం. ఈ శుభ తరుణంలో 75వ విమోచన దినోత్సవం జరుపుకొంటున్న శుభ తరుణాన తెలంగాణ బిడ్డలందరికీ నా పక్షాన, జనసేన పార్టీ పక్షాన శుభాకాంక్షలు తెలుపుతున్నాను” అని పవన్ కళ్యాణ్ అన్నారు.

“అలాగే నిరంకుశ పాలకుల కబంధ హస్తాల నుంచి తెలంగాణ తల్లి విముక్తి కోసం అశువులు ధారబోసిన వీరులకు ప్రణామాలు అర్పిస్తున్నాను. ఈ గడ్డలోని అనువణువునా నిక్షిప్తమైన పోరాట తత్త్వం, అన్యాయాలపై గళమెత్తే గుండె ధైర్యమే ఈ నేలకు సర్వదా రక్ష. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెంది కళకళలాడాలని, ప్రజలు సుఖశాంతులు, సంపదలతో విరజిల్లాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను” అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × three =