గిరిజనులకు 10% రిజర్వేషన్లు, మరో వారం రోజుల్లో దీనిపై జీవో – ఆదివాసీ, బంజారా ఆత్మీయసభలో సీఎం కేసీఆర్

CM KCR Announces 10% Reservation For The Tribals will Give GO in One Week Adivasi and Banjara Athmiya Sabha, CM KCR Announces Reservation For Tribals, GO in One Week , Adivasi and Banjara Athmiya Sabha, Telangana Jathiya Samaikyatha Vajrotsavalu, Jathiya Samaikyatha Vajrotsavalu, Mango News, Mango News Telugu, Kumram Bheem Adivasi Bhavan , Sevalal Banjara Bhavan, KCR To Start Sevalal Banjara Bhavan, Mango News, Mango News Telugu, Kumram Bheem Adivasi Bhavan, Sevalal Banjara Bhavan, CM KCR To Inagurate on Sep17, CM KCR Latest News And Updates, Telangna CM KCR, Kumram Bheem

తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం వేడుకలు రాష్ట్రంలో అట్టహాసంగా జరుగుతున్నాయి. దీనిని పురస్కరించుకుని శనివారం సీఎం కేసీఆర్ బంజారాహిల్స్ రోడ్డు నంబ‌ర్ 10లో నూత‌నంగా నిర్మించిన కుమ్రం భీం ఆదివాసీ భ‌వ‌నాన్ని మరియు సేవాలాల్ బంజారా భ‌వ‌నాన్ని ప్రారంభించారు. అనంతరం ఎన్టీఆర్ స్టేడియంలో ఆదివాసీ, బంజారా ఆత్మీయసభ పేరుతొ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం కేసీఆర్ ప్రసంగించారు. ఆదివాసీ, బంజారాల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి ఆయన వివరించారు.

సీఎం కేసీఆర్ ప్రసంగం లోని కొన్ని ముఖ్యాంశాలు..

  • గిరిజ‌నుల‌కు 10 శాతం రిజ‌ర్వేష‌న్లు అమ‌లు, దీనికి సంబంధించిన జీవోను వారం రోజుల్లో విడుద‌ల చేస్తాం.
  • గిరిజ‌నుల‌కు రిజ‌ర్వేష‌న్ల పెంపు విష‌యంలో కేంద్రానికి ఏడేళ్ల క్రితం లేఖ పంపించాం, ఇంతవరకు దానిపై స్పందన లేదు.
  • గిరిజ‌నుల‌కు రిజ‌ర్వేష‌న్ల పెంపు విష‌యంలో కేంద్రానికి ఏడేళ్ల క్రితం లేఖ పంపించాం, ఇంతవరకు దానిపై స్పందన లేదు.
  • ప్రధాని పుట్టినరోజున చేతులు జోడించి అడుగుతున్నా.. రిజ‌ర్వేష‌న్లు రాష్ట్ర‌ప‌తి ఆమోదం పొందేలా చుడండి.
  • తెలంగాణ పంపిన బిల్లుని కేంద్రం రాష్ట్రపతికి పంపాలి, మా బిల్లుకు రాష్ట్ర‌ప‌తి ముద్ర వేసి పంపించాల‌ని కోరుతున్నాం.
  • 50 శాతానికి మించి రిజ‌ర్వేష‌న్లు ఇవ్వొద్ద‌ని రాజ్యాంగంలో ఎక్క‌డా చెప్పలేదు, త‌మిళ‌నాడులో 69 శాతం రిజ‌ర్వేష‌న్లు ఇస్తున్నారు.
  • గిరిజ‌నుల‌ పోడు భూముల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తాం.
  • భూమి లేని గిరిజనులకు రూ. 10 లక్షలు ఆర్ధిక సాయం అందిస్తాం.
  • ‘దళిత బంధు’ లాగే త్వరలోనే ‘గిరిజన బంధు’ పథకం కూడా ప్రారంభిస్తాం.
  • గిరిజనుల పిల్లల చదువుల కోసం గురుకులాల సంఖ్యను ఇంకా పెంచుతాం.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − two =