హైదరాబాద్‌లో కొలరాడో డెన్వర్ యూనివర్సిటీ.. వచ్చే ఏడాది నుండే తరగతులు

University of Colorado Denver to Set Up First India Campus in Hyderabad

తెలంగాణ విద్యా రంగంలో సరికొత్త అధ్యాయం ప్రారంభం కానుంది. అమెరికాకు చెందిన ప్రముఖ ప్రభుత్వ పరిశోధనా సంస్థ ‘యూనివర్సిటీ ఆఫ్‌ కొలరాడో డెన్వర్’ (CU Denver) భారతదేశంలో తన తొలి క్యాంపస్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) నుంచి యూనివర్సిటీకి అనుమతి పత్రం (Letter of Intent – LoI) లభించింది. తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు కాబోతున్న తొలి విదేశీ విశ్వవిద్యాలయ క్యాంపస్ ఇది కావడం విశేషం.

ఆగస్టు 2027 నుంచి తరగతులు – కోర్సుల వివరాలు

గ్లోబల్ ఎడ్యుకేషన్ సంస్థ ‘ఎమెరిటస్’ (Emeritus) భాగస్వామ్యంతో ‘సియు డెన్వర్’ ఈ క్యాంపస్‌ను నిర్మిస్తోంది. విదేశీ విశ్వవిద్యాలయాల నియంత్రణ చట్టం 2023 ప్రాతిపదికన భారతదేశంలో క్యాంపస్ ఏర్పాటుకు అనుమతి పొందిన తొలి అమెరికన్ పబ్లిక్ యూనివర్సిటీగా ఇది నిలిచింది.

  • ప్రారంభ విద్యార్థుల బ్యాచ్: హైదరాబాద్ క్యాంపస్‌లో ఆగస్టు 2027 నాటికి మొదటి బ్యాచ్ విద్యార్థుల ప్రవేశాలు (Admissions) చేపడతామని వర్సిటీ యాజమాన్యం వెల్లడించింది.

  • ప్రధాన కోర్సులు: విపరీతమైన డిమాండ్ ఉన్న బిజినెస్ (Business), కంప్యూటింగ్ (Computing), ఇంజినీరింగ్ (Engineering), అనాసిటిక్స్ (Analytics) రంగాల్లో ఆచరణాత్మక అభ్యాసన (Applied Learning) ప్రాతిపదికన డిగ్రీ కోర్సులను ఇక్కడ అందించనున్నారు.

  • గ్లోబల్ అవకాశాలు: పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దడంతో పాటు, అమెరికాలోని ప్రధాన క్యాంపస్‌తో సమానమైన విద్యా ప్రమాణాలు, డిగ్రీలు ఇక్కడ లభిస్తాయి.

గ్లోబల్ ఎడ్యుకేషన్ హబ్‌గా హైదరాబాద్

యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో డెన్వర్ ఛాన్సలర్ కెన్నెత్ టి. క్రిస్టెన్సన్ ఈ నిర్ణయంపై స్పందిస్తూ — దశాబ్దాలుగా తమ అమెరికా క్యాంపస్‌లలో భారతీయ విద్యార్థులు భాగస్వామ్యమయ్యారని, ఇప్పుడు నేరుగా హైదరాబాద్‌లోనే నాణ్యమైన అంతర్జాతీయ విద్యను అందుబాటులోకి తేవడం సంతోషంగా ఉందన్నారు. విదేశీ విద్య కోసం ఏటా రూ.లక్షలు వెచ్చించి ఇతర దేశాలకు వెళ్లే భారతీయ విద్యార్థులకు, హైదరాబాద్‌లోనే గ్లోబల్ యూనివర్సిటీ క్యాంపస్ ఏర్పాటు కావడం పెద్ద అవకాశంగా మారనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here