ఖైరతాబాద్‌ లో శ్రీ పంచముఖ మహా లక్ష్మీగణపతి, 50 అడుగుల మట్టి గణేషుడి ప్రత్యేకతలు ఇవే…

Sri Panchamukha Maha Laxmi Ganapathi Idol Set up in Khairatabad All Details of 50 Feet Clay Ganesh,Khairatabad Sri Panchamukha Maha Laxmi Ganapathi , 50ft Eco Friendly Khairatabad Ganesh, Khairatabad Ganesh 50 Ft Ganesh, Mango News, 50 Ft Clay Ganesha Idol At Khairatabad, Khairatabad Ganesh Idol, Khairatabad Sri Panchamukha Maha Laxmi Ganapathi Idol, Ganesh Chaturthi 2022, Khairatabad Ganesh Latest News And Updates, 2022 Khairatabad Ganesh 50Ft Height, Khairatabad Ganesh

తెలుగు రాష్ట్రాల్లో వినాయకచవితి పండుగ పూజలు, ఉత్సవాలకు ఏర్పాట్లు ఘనంగా సిద్ధమవుతున్నాయి. వినాయక చవితి పండగ సందర్భంగా హైదరాబాద్ లోని ఖైరతాబాద్ లో ప్రతిష్టించే మహాగణపతి విగ్రహానికి దేశవ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యత ఉన్న సంగతి తెలిసిందే. ఖైరతాబాద్ లో గణేష్ ఉత్సవాలు 1954 నుంచి ఘనంగా జరగుతుండగా, ఇది 68వ సంవత్సరం. ఈ ఏడాది ఖైరతాబాద్‌‌లో శ్రీ పంచముఖ మహా లక్ష్మీ గణపతి రూపంలో గణేశుడు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. మండపంలో మహాగణపతి విగ్రహానికి కుడివైపున శ్రీ షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి, ఎడమవైపున శ్రీ త్రిశక్తి మహాగాయత్రీ దేవి అమ్మవార్ల విగ్రహాలను ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సూచనతో 60 ఏళ్లలో మొదటిసారిగా ఖైరతాబాద్‌ గణేషుడి విగ్రహాన్ని మట్టితో తయారు చేశారు.

జూన్ 10వ తేదీన ఖైరతాబాద్‌ గణేషుడి విగ్రహ పనులు ప్రారంభం అయ్యాయని, 50 అడుగుల ఎత్తుతో మట్టి గణేషుడి విగ్రహం తయారీ కోసం శిల్పులు చిన్నస్వామి రాజేంద్రన్‌, సుభాష్ సహా ఒడిశా, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ, ఏపీ ఇలా ఐదు రాష్ట్రాల నుంచి కళాకారులు, దాదాపు 150 మంది కార్మికులు కనీవినీ ఎరుగని రీతిలో రాత్రింబవళ్ళు పనిచేశారని గణేష్ ఉత్సవ కమిటీ కమిటీ కన్వీనర్ సందీప్ రాజ్ తెలిపారు. ఆగస్టు 31 నుంచి గణేష్ ఉత్సవాలు ప్రారంభం కానుండగా, రెండు రోజుల ముందు నుంచి అనగా ఆగస్టు 29 నుంచి భక్తులకు దర్శనం ఉంటుందన్నారు. మహాగణపతికి తొలిపూజ తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చేతుల మీదుగా జరుగుతుందన్నారు. ఇక గతంలో లాగానే ఈ ఏడాది కూడా హుస్సేన్ సాగర్ లోనే భారీ స్థాయిలో నిమజ్జన కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఆగస్టు 31న ప్రారంభమయ్యే గణేష్ ఉత్సవాలు, సెప్టెంబర్ 9వ తేదీన నిర్వహించే నిమజ్జన శోభాయాత్ర కార్యక్రమంతో ముగియనున్నాయి.

ఆగస్టు 31న వినాయకచవితి నుండి దర్శనానికి వచ్చే లక్షలాది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. పటిష్టమైన బారికేడ్స్ ఏర్పాటు, వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు, ఉత్సవాలు ముగిసే వరకు ఈ మార్గంలో వాహనాల రాకపోకలు నిలిపివేత, విద్యుత్ సరఫరా సహా అన్ని ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. మరోవైపు హైదరాబాద్ నగరవ్యాప్తంగా గణేష్ ఉత్సవాలు, గణేష్ నిమజ్జనం వేడుకలకు అన్ని ఏర్పాట్లు సిద్ధమవుతున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × three =