వీటీజీసెట్-2023 ప్ర‌వేశ‌ప‌రీక్ష‌ ద‌ర‌ఖాస్తు గ‌డువు మార్చి 20 వరకు పొడిగింపు

VTGCET-2023: Last Date for Submission of Online Applications Extended till March 20th,VTGCET-2023,VTGCET Last Date For Submission,VTGCET Online Applications Extended Till March 20th,VTGCET-2023 Online Applications,Mango News,Mango News Telugu,TGCET 2023 Application Form,Telangana Gurukul 2023,TGCET 2023 for TS Gurukulam,TS Gurukulam 5th Class Admissions,TS Gurukul CET 2023 Registrations,TS Gurukulam 5th Class Admission 2023-24,VTGCET 2023 Latest News,VTGCET 2023 Submission Latest Updates

తెలంగాణ రాష్ట్రంలోని గురుకులాల్లో ఐదో తరగతి ప్రవేశాల కోసం నిర్వహించే వీటీజీసెట్-2023 (తెలంగాణ గురుకుల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) దరఖాస్తు గడువును మార్చి 20వ తేదీ వరకు పొడిగించారు. ముందుగా ఈ ప్రవేశ పరీక్ష కోసం ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీని మార్ఛి 6గా నిర్ణయించగా, అనంతరం మార్చి 16వ తేదీ వరకు, తాజాగా మార్చి 20వ తేదీ వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు వీటీజీసెట్ చీఫ్ కన్వీనర్ రోనాల్డ్ రోస్ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. విద్యార్థులు/అభ్యర్థులు ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణ కోసం www.tswreis.in, http:/tgcet.cgg.gov.in, http:/mjptbcwreis.telangana.gov.in, http:/tgtwgurukulam.telangana.gov.in వంటి వెబ్‌సైట్‌లను సందర్శించాలని సూచించారు.

మరోవైపు వీటీజీసెట్-2023 ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 23వ తేదీ ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నిర్దేశించిన కేంద్రాలలో నిర్వహించనున్నారు. 2023-2024 విద్యా సంవత్సరానికి గానూ రాష్ట్రంలోని సోషల్, ట్రైబల్, బీసీ మరియు జనరల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లలో 5వ తరగతిలో ప్రవేశాల కోసం వీటీజీసెట్-2023 నిర్వహించనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve − 4 =