వాతావరణ శాఖ కీలక సూచన.. తెలంగాణలో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం, ఎల్లో అలెర్ట్‌ జారీ

Hyderabad IMD Predicts Heavy Rains For Next Three Days and Issues Yellow Alert in Telangana,Hyderabad IMD Predicts Heavy Rains,Hyderabad Heavy Rains For Next Three Days,Hyderabad IMD Issues Yellow Alert,Yellow Alert in Telangana,Mango News,Mango News Telugu,Telangana likely to receive rains for 3 days,Heavy Rain Forecast News,Hyderabad Rains Latest Updates,IMD predicts Latest News,Hyderabad IMD predicts News Today,Hyderabad Heavy Rains Latest News and Updates

తెలంగాణ వ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గత కొన్నిరోజులుగా క్రమంగా ఎండలు పెరుగుతున్న పరిస్థితి ఉండగా.. గురువారం అనూహ్యంగా వాతావరణం చల్లబడి చాలా జిల్లాల్లో వర్షం పడింది. ఈ క్రమంలో రాష్ట్రంలో రాబోయే నాలుగురోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తర-దక్షిణ ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఆరెంజ్‌, ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది. దీని ప్రకారం.. రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, ములుగు, సిద్ధిపేట, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, యాదాద్రి భువనగిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, నాగర్‌ కర్నూల్‌, మెదక్‌, కామారెడ్డి తదితర జిల్లాల్లో అక్కడకక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అలాగే గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీయడంతో పాటు అనేక చోట్ల వడగళ్ల వర్షం కూడా కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. కాగా ఈరోజు మధ్యాహ్నం జీహెచ్‌ఎంసీ పరిధిలోని పలు ప్రాంతాల్లో వడగళ్ల వాన కురిసింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine − three =